ఇదే విషయం నేను గత కొంత కాలం గా ఆలొచిస్తున్నా,బ్లాగు రాసేంతగా చేసింది నిన్న నేను చూసిన ఇంటార్వ్యు.
అసలు కథ పట్ల మన దర్శకులకు ఎంత అభిమానం ఉందో అది చూస్తే అర్ధం అవుతుంది .
అసలు ఈ మధ్య సినిమాల్లో కథ నిజం గా ఉంటోందా?
ఈ ప్రశ్నకు ఠక్కున లేదు అనే జవాబే చాలా నోట్ల విన్నాను.
నాకో చెడ్డ అలవాటు.ఎవరు సినిమా చూసా అని చెప్పినా,వెంటనే కథ చెప్పు అని ప్రాణం తీస్తా.
ఈ మధ్య ఈ అలవాటుకి కాస్త విరామమం వచ్చింది.సినిమా చూసిన వాడెవడూ కథ ఏంటో చెప్పట్లేదు
మామూలు మాటల్లో చెప్పలేని దృశ్య కావ్యం ఏమో అని నేను కొన్ని సినిమాలు లేటుగా చూసాను
నాకు ఆ భావమే కలిగింది.
ఇలా బ్లాగులో నేను చూసిన సినిమా గురించి రాయాలంటే నాకు మాటలు దొరకలేదు.
సరే నా తెలుగు పాండిత్యం ఇంతవరకే అనుకుని తృప్తి చెందాను.
ఇలా నన్ను నేను ఎన్నో సార్లు సమధాన పరచుకున్నా,నిన్న నేను చూసిన కార్యక్రమం ఇలా బ్లాగేంతవరకు నిద్ర పోన్నివ్వలేదు.
ఈ మధ్య అంతా ‘చిరు’ తనయుడు పేర విడుదల అయిన చిరుత.
అలా టి వీ తిప్పుతుంటే పూరి జగనాథ్ కనిపించాడు.అంతా ఆ సినిమా క్లాసులో మాట్లాడుతున్నారు ,నేను ఈ కార్యక్రమం చూసి,సినిమ చూసా అని పోసు కొడదాం అని అనుకున్నా.
సరే వాణిజ్య ప్రకటనల విరామాల్లో పూరి మాట్లాడాడు.పాపం ఈ ఆంకరు ఈ సినిమ కథ తమ ప్రేక్షకులకు చెప్పిద్దాం అని అడిగిన ప్రశ్ననే రక రకాలు గా అడిగినా పూరి ఒకటే జవాబు చెప్పాడు.
ఈ సినిమాలో కథ ఎమీ లేదు అని,కేవలం మెగాస్టార్ తనయుడిని పరిశ్రమకు పరిచయం చెయ్యడం కోసమే ఈ సినిమ తీసానని,కథని పెద్దగా పట్టించుకోలేదని చెప్పడం నాకు భలే ఆశ్చర్యం వేసింది.
నేను సరిగ్గా వినలేదేమో అని ఆ కార్యక్రమం ఆసాంతం చూసాను.మళ్ళీ అదే చెప్పాడు
ఇక ఏం అనాలీ
కథ నటుడి కోసమా?
నటుడు కథ కోసమా?
మన సినిమాలు ఎందుకు అంతర్జాతీయం గా గుర్తింపు పొందట్లేదు అనడానికి ఈ కార్యక్రమమే నిదర్శనం
ఎవరో కొడుకుని పరిచెయ్యడం కోసం ఇష్టం వచ్చినట్టు ఒక్కో సినిమా నుంచీ కాస్త కాస్త తెచ్చి అతికించడమేనా?
ఒక గొప్ప నటుడి కొడుకు/మనవడు అని అచ్చేసి జనాల మీద కి తొసేస్తె చాలా?
వారికంటూ ఒక సొంత గుర్తింపు అక్కరలేదా?
అసలు నటించడానికి వారికున్న కనీస అర్హత ఏంటి?
రంగస్థల అనుభవం ఉండాలని ఆశించడం అత్యాశే గాని,కనీసం నటనకు సంబంధిత శిక్షణ ఎంత వరకు తీసుకున్నారు?
ఏదో గెంతడం,కొట్టడం నేర్చుకున్నంత మాత్రానా హావభావాలను పలికించే అవసరం వారికి లేదా?
అసలు నటన ఎదో వారసత్వం కొనసాగింపుకా లేక నిజం గా ఈ కళ పట్ల వారికి అంకిత భావం ఉందా?
సినిమా అన్నది దృశ్య కావ్యం గా ఎంత మంది దర్శకులు భావిస్తున్నారు
ఒకప్పుడు సినిమా ఒక భాషలో తీస్తున్నారు అంటే ఆ భాష మీద మంచి పట్టు ఉండేది.
అందుకే అప్పటి సినిమాల్లో సంభాషణలు ఇప్పటికీ మనం గుర్తు చేసుకుంటున్నాం,సమయోచితం గా వాడతాం.
మరి ఇప్పుడు సంభాషణలు రాసేవారికి నిజం గా తెలుగు భాష మీద అంత పట్టు ఉందా?
మా బామ్మకి హిందీ రాకున్నా అప్పట్లో “నవ్ రంగ్ ” సినిమాకు బండి కట్టుకు వెళ్ళిందట.ఇప్పటికీ నేను అడుగుతా మా బామ్మని నీకు ఆ సినిమా ఏం అర్ధం అయ్యింది అని.తను చెప్పే సమధానం ఒక్కటే అక్కడ తెర మీద చేసే వారి ముఖం లో ఎం జరుగుతోందో అర్ధం అవుతుంది కదా,ఇక భాషతో అవసరం ఏంటి అని.
మరి ఇప్పట నటీనటులు అంత చక్కగా హావభావాలు పలికించగలరా?
అసలు నటీనటుల నుంచీ నిజం గా ఈ దర్శకులు నటనను రాబడుతున్నారా?
అసలు దర్శకులుగా పరిచయ్యం అయ్యేవారికి అన్ని విభాగల మీద పట్టు ఉందా?
ఎంతసేపటికీ పరభాషా చిత్రాల నుండి కథను అరువు తెచ్చుకోవడమే తప్ప నిజం గా మనకు కథలు లేవా?
మన పురాణ కథలనే ఇప్పటికాలానికి అణుగుణం గా ఎందుకు మలచరు?
ఇక్కడ మన తెలుగు పాటలు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది
డాక్తర్ చక్రవర్తి చిత్రం లో “ఓ ఉంగలారల ముంగురులున్న రాజా” అన్న జానపద గీతం లో “తస్సదియ్య” అన్న పదానికి సెన్సారు వారు అభ్యంతరం చెప్పారట.
మరి నేడు?
అసలు మన తెలుగు సినిమ అంతార్జాతీయ(కనీసం జాతీయ)స్థాయి పురస్కారం పొంది ఎన్ని ఏళ్ళు అయ్యిందో …
జాతీయ పురస్కారం పొందినా అవి నిజం గా అంత విలువ చేస్తాయా అన్న అనుమానం ప్రతి ఒక్కడికీ కలుగుతుంది
తెలుగు సినిమాకు మహర్దశ రావాలంటే ఈ వారసత్వ నటులు పోయి ఈ కళ పట్ల అంకితభావం ఉన్న వాళ్ళు ,భాష మీద పట్టు ఉన్న వాళ్ళు రావాలి.
ప్రభుత్వం తరపున మంచి కళాత్మక సినిమాలకు రాయతీలు కలిపించి అలాంటివి తీసేవారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి.
పైరవీలు లేని జాతీయ పురస్కారాలు,అంగాంగ ప్రదర్శననని అనుమతించని సెన్సారు బోర్డు వంటి కనీస చర్యలు తీసుకున్నప్పుడే తెలుగు సిని తల్లి పట్టు బట్ట కడుతుంది
బాగా రాశారండి. కొత్త సినిమాకు వెల్ళాలంటేనే చిరాకేస్తోంది. తెలుగు సినిమానేనా అనే అనుమానం కలుగుతోంది.
వేణు
“మామూలు మాటల్లో చెప్పలేని దృశ్య కావ్యం ఏమో అని…” – no comments except almost fell of the chair laughing, one of the best critisim I’ve read in recent times. ఎంత వెటకారమండి మరీను – ఏదో డబ్బులున్నాయని వాళ్ళేదో సినిమాల్తీసుకొంటుంటే. కళ, నటన ఎవడిక్కావాలి.
its fact but no budy can change
అవును, మన సిని పరిశ్రమ ఇలా ఉండడానికి కరణాలు వారసత్వపు నటులు, హీరోల ఇమేజ్ కోసం రాయబడే కధలు (కధంటూ ఉంటే), తెలుగు తెలియని వాళ్ళు పాడే పాటలు – ఇలా చెప్పుకుంటూ పోతే మీరు రాసిన టపా అంత అవుతుంది చిట్టా..
భాగా రాసారు.
హీరోలవ్వాలంటే నటనతో సంభందం లేదు
చిరంజీవి కొడుకు
నాగార్జున మేనల్లుడు
అల్లూరవంద్ బామ్మర్ది
పలాన వాడి తోడల్లుడు
పలానా వాడి తమ్ముడు… ఇలా
ఎనకాల పెద్ద పేరున్నోడుంటే సరిపోద్ది.
సినిమా.., కధ.., ఈ విషయాలు ఎలా ఉన్నప్పటికి ’పూరీ’ని కొన్ని విషయాలలో అభినందించకుండా ఉండలేక పోతున్నాను.
౧.) కధ లేని సినిమా లే తీస్తున్నానని నిజాయితీ గా ఒప్పుకోవటం
౨.) “నేను తీస్తున్న సినిమాలు గొర్రె ల కోసమే గాని మనుషుల కోసంకాదు” అని అతని ఉద్దేశ్యమైనా, ఆ విషయం నేరుగా చెప్పక పోవటం.
అయినా యిప్పుడు వస్తున్నవాటిని తెలుగు సినీమాలని యెవరన్నారు? నిస్సంకోచంగా చెప్తాన్నేను అవి పరభాషా సిత్రాలని.
chala excellent ga chepparu
నేను కూడా మొన్న సెప్టెంబరులో కొన్ని తెలుగు సినిమాలు చూసి,
బాధ ఆపుకోవడానికి ఏకంగా ఇదే అంశం మీద రెండు టపాలు వ్రాసాను.
http://andam.blogspot.com/search/label/సినిమా
ఎవరికి వారం సినిమాలు తీసుకొని చూసుకుంటే ఇంకా సంతృప్తి చెందగలం అనుకుంటా.
chala baaga chepparu sir,week antha kasta padi weekend lo manchi cinema ki friends tho kalisi veldamante manchi cinemale levu…thera vellina kuda nirase migulthundi…
your paper is excelent
Now in this days every one want to earn money power and name. So now they select the way to get name ,money and power of papularity in publick thatis cenema.so we forget about the good picture is not avaible in future.The way of taking,the way of dress waring hero and heroin is very nasty.We con’t see the picture with our famaly.The “haridity” is avaible in ceneme feald famaly.It is a danger disease now avaible in all cenema fealds.
namaste sir
neenu telugulo kathalu vrasanu kanee evaru chance ivvadam lethu vallu theeyaru memu theestham ante chance lu ivvaru pettubadi pettaru naaku pettubadi pedithe manchi kathato oka manchi telugu cinima chesichoopistha chance ippinchagalara
naanyatha leni cinimaalu theesi janala meediki vadile nirmathalu vunnanthavaraku telugu cinema paristhithi inthe
Namaste sir,
Chala baga rasaru mana telugu cinimala gurinchi.mana telugu cinemalu chudlante chala chiraku vastundi sir. endukante mana telugu cinema sutrani okkasari gamanichandi. parichaya sanniveshamlo oka pata thani ventane oka fight konni sentiment sanniveshalu malli oka pata oka fight thanto intervel mali ade varusaga vachi shubham pdutundi. inko veshayam sir mana telugu cinemalu kutumbamto kurchuni chuse vidamuga undane undavu.maha gopa cinemalandi babu. nenu malaysia lo untunanu nato patu unna valla anta tamil valle. vallaki mana cinema ante naalugu patalu nalugu fightlu ekuvaka ardanagna sanniveshamulu.epudu kottaga vachina cinemalo oka mache cinema andi nenu chudaledu sir. last ga chusina manche cinema bomarillu. manche katha kani aa director tamil. chusara chevari rendu years tamil valle national awrds geluchukunnaru. kani manavalu chevari sarega naku telsi chivariga 6 year mundu kristna gari kuturu tisena cinema.mana telugu cinemalu sagam tamil nuchi remake chesinave. mana cirectors lo national level lo thelisanavalu K.VISHVANAD GARU, BAPU GARU,varidhariki vayasaindi inka eni rojulakandi mana telugu cinemaki manchi peru mana telugu cinema ante chala manchee cinemalu thesataru ane abiprayam vastundi? naku teliyadu sir, naku cheranjeevi garu ante chala chala ishtam kani koni koni sarlu ayna garu chesina cinema lu chuste ela ayan garu oppukunnaru ani anipistundi sir. nanu adigite mana cinemalu vyaparam kosame teyabaduthunayi anthe kani prkshkulaku manchi cinema chupadaniki kadu.monna oka sari tv program adi tamil tv program andulo BHUNUCHANDAR GARU matladaru varu cheppina matalu vennte naku chala badaga undu sir ayana garu chepina matalu mana telugu cinema lo 100 cinemalo edo 1 or 2 cinema lu manchi cinimalu miglanvani chtha cinemalu anna vedamuga matladaru.ante mere alochencandi mana cinemalu enta duramu pryanichaye anedi. TELUGU CINEMA ANEDI OKA VYAPARAM ANTE KANI. VARASULU RAVADAM GURINCHI NENU TAPUGA MATLADATAM LEDU VALLU VACHINA MANCHE CINEMALU THESTHE ANTE CHLU.
ante kani tamil lo vachina anni cinemalu manavalu ramake cheyadmekadu manakantu oka manche cinema lu theyali. why mana dagira manche cinemalu tise directors lera? lekapote manaku cinemalu theya chetakaada ?
Naku chala rojula nuchie oka asa sir. mana cinema ante ento andarki chupinchali andhra ante ento chupinchali. telugu cinema ante chala manchi cinemalu ani andaru chepali ane vedamu ga cinema theyali ani kani avakashalu dorkadam ledu sir.nenu raka poyena parvaledu kani mana telugu cine parishramaku manche directers ravali ane nu=enu korukuntunanu,
nanu adigite tamilnadu lo unatlu ga mana andhra lo kud ok gov filim school & tv institute petinchali. apudu kani mana telugu cinemalaki gurthimpu radu. meku velaythe ee pani matram cheyandi sir.nenu na manspurtiga korkuntunna vishayam ide sir.
Naku ee avakashmunu echinaduku krutagnalu sir.
its a fine article. but i think we missed so many things
Mundu manam andaran cinemalu chudadam maneyali.Manam cinemaklu chustunnam kada ani valla yistam vachinatlu teestunnaru.Fans ,Opening collections eegodavalento . Ego between fans chage avvali. Appude manam manchi natulli kakapoyina kaneesam manchi cinema ayina chudagalam.
అంగాంగ ప్రదర్శననని అనుమతించని సెన్సారు బోర్డు వంటి కనీస చర్యలు తీసుకున్నప్పుడే తెలుగు సిని తల్లి పట్టు బట్ట కడుతుంది ….
సెన్సారు బోర్డు మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు? మీ ఆశ నెరవేరదు కాక నెరవేరదు.