బతకమ్మ బతకమ్మ ఉయ్యాల

అసలు నా బతుకు ఎలా అయ్యిందంటే నవరాతృలు వచ్చినా,పూర్తి అవుతున్నా నా అంతః,బాహ్య ప్రపంచకాలలో  మార్పేమి రాలేదు.

అదే 3వ నంబరు బస్సు,అదే కండక్టరు బాబాయి,అదే కాలేజీ,అదే పక్క బెంచి పావని,అదే లూసు షర్టు హనుమంతరావు సారు.

నేను నిద్ర లేవక ముందే మా ఇంట్లో ఏవో పూజల పేరిట దేవుడి ఊపిరి తీసేపనిముగించేస్తారు కాబట్టి ,నా వ్యక్తిగత జీవితానిలోనూ పెను తుఫాను ఏమీ లేదు.
 
మనం ఇలా ఉన్నాం,పక్క వాళ్ళెలా పండగ చేసుకుంటున్నారో అని పావని కి ఫోను చేసాను
ఎలా చేసుకుంటున్నావే పండగ అంటే..”ఏముందే ఈటీవీ సుమన్ కి అవార్డుల షాపు ఇచ్చేసారు,ఏది కావాలో తీసుకొ అని,మా టీ వీ లో “అస్కో బుస్కో కాస్కో……..దమ్ముంటే చూస్కో” సినిమా ,ఇక టీ వీ 9 లో పండగ రోజు చిరంజీవి అల్లుడి మీద ప్రత్యేక వార్తా  కధనం” అంటూ అన్ని చానళ్ళ పట్టిక చెప్పేసింది.

ఇలా కాదని  మా సన్నీ గాడికి ఫోను చేసాను.వాడినీ అడిగాను పండగకు ఏమి చేస్తున్నావు రా అని.వాడు 3 సినిమాలు,6 పార్టీలు,12 కేకు కటింగులు అని చెప్పాడు.

దేవుడా  అని ఒక నిట్టూర్పూ సట్టూర్పు వదులుతున్న తరుణం లో దూరం గా మైకు లో “బతకమ్మ బతకమ్మ ఉయ్యాల….” అన్న పాట వినిపించింది.

   
అసలు ఎవరీ బతకమ్మా,ఆమెకు ఉయ్యాల ఏంటి,ఆమెకు ఉయ్యాల ఊగేంత తీరిక ఏలా ఉంది,ఆమె ఆర్కుట్ లో లేదా అని బోలెడు ధర్మ సందేహాలు నాకు వచ్చేసాయి  
 ఈ పాట నాకేంటి తెగ అర్థమై పోతోంది,తెలుగు పాట కాదేమో అని ఆ పాట వైపుగా పయనం సాగించా. 
 
రాజీవ్,ఇందిరమ్మ ల గుడిగా ఇంకా రూపాంతరం చెందని “శివాలయం ” అది
విశాలమైన ప్రాంగణం.
వేప,రావి,నేరేడు చెట్లతో చల్లగా ఉంది.
“ఆమ్మవారు దుర్గాదేవి అలంకారం లో విరాజిల్లుతున్నారు,భక్తులు దర్శనం చేసుకోగలరు” అని మైకు లో చెప్తున్నారు
 
నా అడుగులు తమంతట తామే గుడిలో ప్రవేశించాయి.దివ్య మంగళ హారితి వెలుగులో అమ్మ నిండుగా కనిపిస్తోంది.పెద్ద కళ్ళు,దీపాల వెలుగులకి పోటీగా మెరిసే ముక్కెర,ఎర్రటి చీర.

అంతలో పూల పళ్ళాలతో ఆలయం లో కొందరు ముత్తైదువులు  ప్రవేశించారు. 
ఆ పూల గుత్తే “బతకమ్మ”
తమ శక్తి ని బట్టీ ఒక్కొక్కరు రకరకాల పూలను గుండ్రం గా ఒక పళ్ళెం లో అలంకరించారు
ఆ గుత్తి మీద పసుపుతో చిన్న ఆకృతి పెట్టారు

మెల్లెగా ఆడవాళ్ళ రాక పెరిగింది.వాటితో పాటే ఈ బతకమ్మలునూ.ఒక చోట అంతా దగ్గర చేర్చి చుట్టు మూగారు.దాని చుట్టు చపట్లు కొట్టుకుంటూ తిరుగుతూ పాటలు పాడారు

చీకటి పడడం తో ఈ బతకమ్మలను దగ్గరలోని చిన్న కొలనులో వదిలారు.బతకమ్మ మీద చిన్న దీపం నీళ్ళల్లో అందం గా ఊగుతూ ముందుకు సాగడం ఎంతో అందం గా ఉంది
 
కొంతమంది ప్రసాదం గా అటుకులూ,బెల్లం ఇచ్చారు.
ఇంకొందరు 9 రకాల పిండ్లను నెయ్యి తో కలిపిన మిశ్రమాన్ని పంచారు.

ప్రకృతి ఆరాధనకు నిదర్శనం ఈ  బతకమ్మ.నవరాత్రులు మొదలుకుని,అష్టమి వరకు ప్రతి రోజూ బతకమ్మ ని తయారు చేసి నీళ్ళల్లో వదలడం తెలంగాణ ప్రజల ఆచారం.

పార్వతీ దేవి స్వరూపం గా ఈ బతకమ్మను భావించి కన్నె పిల్లల దగ్గర నుంచీ ,పండు ముత్తైదువుల వరకు ఈ పండుగను సామూహికం గా జరుపుకుంటారు

తెలంగాణ యాస లో సాగే ఈ బతకమ్మ పాటల అంతరార్ధం “సర్వేజనా సుఖినోభవంతు” 
 
ఇంటికి రాగనే ఎదురుగా లైబ్రరీ నుంచీ తెచ్చుకున్న The concept of Socialisation and Inter personnel skills by Stephen.P.Robbins నవ్వుతూ దర్శనమిచ్చింది

బతకమ్మ బతకమ్మ ఉయ్యాలా అని నవ్వుతూ ఈ పుస్తకాన్ని పావనికి బేరానికి పెట్టేసాను

Published in: on అక్టోబర్ 20, 2007 at 5:43 ఉద.  3 వ్యాఖ్యలు  

మన తెలుగు సినిమా పయనం ఎటు?

ఇదే విషయం నేను గత కొంత కాలం గా ఆలొచిస్తున్నా,బ్లాగు రాసేంతగా చేసింది నిన్న నేను చూసిన ఇంటార్వ్యు.
అసలు కథ పట్ల మన దర్శకులకు ఎంత అభిమానం ఉందో అది చూస్తే అర్ధం అవుతుంది .
అసలు ఈ మధ్య సినిమాల్లో కథ నిజం గా ఉంటోందా?
ఈ ప్రశ్నకు ఠక్కున లేదు అనే జవాబే చాలా నోట్ల విన్నాను.
నాకో చెడ్డ అలవాటు.ఎవరు సినిమా చూసా అని చెప్పినా,వెంటనే కథ చెప్పు అని ప్రాణం తీస్తా.
ఈ మధ్య ఈ అలవాటుకి కాస్త విరామమం వచ్చింది.సినిమా  చూసిన వాడెవడూ కథ ఏంటో చెప్పట్లేదు
మామూలు మాటల్లో చెప్పలేని దృశ్య కావ్యం ఏమో అని నేను కొన్ని సినిమాలు లేటుగా చూసాను
నాకు ఆ భావమే కలిగింది.
ఇలా బ్లాగులో నేను చూసిన సినిమా గురించి రాయాలంటే నాకు మాటలు దొరకలేదు.
సరే నా తెలుగు పాండిత్యం ఇంతవరకే అనుకుని తృప్తి చెందాను.
ఇలా నన్ను నేను ఎన్నో సార్లు సమధాన పరచుకున్నా,నిన్న నేను చూసిన కార్యక్రమం ఇలా బ్లాగేంతవరకు నిద్ర పోన్నివ్వలేదు. 
ఈ మధ్య అంతా ‘చిరు’  తనయుడు  పేర విడుదల అయిన  చిరుత.
అలా టి వీ తిప్పుతుంటే పూరి జగనాథ్ కనిపించాడు.అంతా ఆ సినిమా క్లాసులో మాట్లాడుతున్నారు ,నేను ఈ కార్యక్రమం చూసి,సినిమ చూసా అని పోసు కొడదాం అని అనుకున్నా.

సరే వాణిజ్య ప్రకటనల విరామాల్లో పూరి మాట్లాడాడు.పాపం ఈ ఆంకరు ఈ సినిమ  కథ తమ ప్రేక్షకులకు చెప్పిద్దాం అని అడిగిన ప్రశ్ననే రక రకాలు గా అడిగినా పూరి ఒకటే జవాబు చెప్పాడు.
ఈ సినిమాలో కథ ఎమీ లేదు అని,కేవలం మెగాస్టార్ తనయుడిని పరిశ్రమకు పరిచయం చెయ్యడం కోసమే ఈ సినిమ తీసానని,కథని పెద్దగా పట్టించుకోలేదని చెప్పడం నాకు భలే ఆశ్చర్యం వేసింది.

నేను సరిగ్గా వినలేదేమో అని ఆ కార్యక్రమం ఆసాంతం చూసాను.మళ్ళీ అదే చెప్పాడు

ఇక ఏం అనాలీ
కథ నటుడి కోసమా?
నటుడు కథ కోసమా?

మన సినిమాలు ఎందుకు అంతర్జాతీయం గా గుర్తింపు పొందట్లేదు అనడానికి ఈ కార్యక్రమమే నిదర్శనం

ఎవరో కొడుకుని పరిచెయ్యడం కోసం ఇష్టం వచ్చినట్టు ఒక్కో సినిమా నుంచీ కాస్త కాస్త తెచ్చి అతికించడమేనా?

ఒక గొప్ప నటుడి కొడుకు/మనవడు అని అచ్చేసి జనాల మీద కి తొసేస్తె  చాలా?
వారికంటూ ఒక సొంత గుర్తింపు అక్కరలేదా?
అసలు నటించడానికి వారికున్న కనీస అర్హత ఏంటి?
రంగస్థల అనుభవం ఉండాలని ఆశించడం అత్యాశే గాని,కనీసం నటనకు సంబంధిత శిక్షణ ఎంత వరకు  తీసుకున్నారు?
ఏదో గెంతడం,కొట్టడం నేర్చుకున్నంత మాత్రానా హావభావాలను పలికించే అవసరం వారికి లేదా?

 అసలు నటన ఎదో వారసత్వం కొనసాగింపుకా లేక నిజం గా ఈ కళ పట్ల వారికి అంకిత భావం ఉందా?
 

సినిమా అన్నది దృశ్య కావ్యం గా ఎంత మంది దర్శకులు భావిస్తున్నారు
ఒకప్పుడు సినిమా ఒక భాషలో తీస్తున్నారు అంటే ఆ భాష మీద మంచి పట్టు ఉండేది.
అందుకే అప్పటి సినిమాల్లో సంభాషణలు ఇప్పటికీ మనం గుర్తు చేసుకుంటున్నాం,సమయోచితం గా వాడతాం.
మరి ఇప్పుడు సంభాషణలు రాసేవారికి నిజం గా తెలుగు భాష మీద అంత పట్టు ఉందా?

మా బామ్మకి హిందీ రాకున్నా అప్పట్లో “నవ్ రంగ్ ” సినిమాకు బండి కట్టుకు వెళ్ళిందట.ఇప్పటికీ నేను అడుగుతా మా బామ్మని నీకు ఆ సినిమా ఏం అర్ధం అయ్యింది అని.తను చెప్పే సమధానం ఒక్కటే అక్కడ తెర మీద చేసే వారి ముఖం లో ఎం జరుగుతోందో అర్ధం అవుతుంది కదా,ఇక భాషతో అవసరం ఏంటి అని.  

మరి ఇప్పట నటీనటులు అంత చక్కగా హావభావాలు పలికించగలరా?

అసలు నటీనటుల నుంచీ నిజం గా ఈ దర్శకులు నటనను రాబడుతున్నారా?

అసలు దర్శకులుగా పరిచయ్యం అయ్యేవారికి అన్ని విభాగల మీద పట్టు ఉందా?

ఎంతసేపటికీ పరభాషా చిత్రాల నుండి కథను అరువు తెచ్చుకోవడమే తప్ప నిజం గా మనకు కథలు లేవా?

మన పురాణ కథలనే ఇప్పటికాలానికి అణుగుణం గా ఎందుకు మలచరు?

ఇక్కడ మన తెలుగు పాటలు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది

డాక్తర్ చక్రవర్తి చిత్రం లో “ఓ ఉంగలారల ముంగురులున్న రాజా” అన్న జానపద గీతం లో “తస్సదియ్య” అన్న పదానికి సెన్సారు వారు అభ్యంతరం చెప్పారట.
మరి నేడు?
 
అసలు మన తెలుగు సినిమ అంతార్జాతీయ(కనీసం జాతీయ)స్థాయి పురస్కారం పొంది ఎన్ని ఏళ్ళు అయ్యిందో …

జాతీయ పురస్కారం పొందినా అవి నిజం గా అంత విలువ చేస్తాయా అన్న అనుమానం ప్రతి ఒక్కడికీ కలుగుతుంది

తెలుగు సినిమాకు మహర్దశ రావాలంటే ఈ వారసత్వ నటులు పోయి ఈ కళ పట్ల అంకితభావం ఉన్న వాళ్ళు ,భాష మీద పట్టు ఉన్న వాళ్ళు రావాలి.

ప్రభుత్వం తరపున మంచి కళాత్మక సినిమాలకు రాయతీలు కలిపించి అలాంటివి తీసేవారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి.

పైరవీలు లేని జాతీయ పురస్కారాలు,అంగాంగ ప్రదర్శననని అనుమతించని సెన్సారు బోర్డు వంటి కనీస చర్యలు తీసుకున్నప్పుడే తెలుగు సిని తల్లి పట్టు బట్ట కడుతుంది

Published in: on అక్టోబర్ 6, 2007 at 12:48 సా.  18 వ్యాఖ్యలు  

నేడు గురజాడ జయంతి

ఈ పేరు వినగానె చటుక్కున గుర్తొచ్చేది “కన్యాశుల్కం”
బాల్య వివాహల పై,వితంతు పునర్వివాహలపై ఆ నాటిక ఒక చంప పెట్టు

ఆద్యంతమూ చమక్కులతో ఆ నాటి సాంఘిక పరిస్థితులకు అద్దం పట్టే నాటిక అది.

ఆ నాటిక తెచిన మార్పు అంతా ఇంతా కాదు
 

“దిద్దుబాటు ” అని మార్పులు తెచ్చినా “చుట్ట తాగని వాడు దున్న పోతై పుట్టు ” అంటు సున్నిత హాస్యం తో కూడిన పద్యం చెప్పినా,”young beautiful,unfortunate widow ” అని బుచ్చమ్మను (ఆ నాటి స్త్రీ) ని పొగిడినా,”కన్యక” పేరు తో కన్నీళ్ళు తెప్పించినా,”యే దేశ మేగినా,ఎందుకాలెడినా” అంటూ దేశ భక్తిని రగిల్చినా గురజాడ వారికే చెల్లు

మన దురదృష్టం మూలానా ఈ రోజు ఆయన మీద ఒక్క వ్యాసామే కనిపించింది

Published in: on సెప్టెంబర్ 21, 2007 at 3:53 ఉద.  6 వ్యాఖ్యలు  

ఎటు పోతున్నాం మనం?

 చదివాక ఈ కిందదీ ఎంతో సముచితం అని భావించి టపా రాస్తున్నా

మా వీధి లో జరిగిన ఒక యధార్ధ సంఘటన మీ ముందు ఉంచుతున్నా

“మేము ఉంటున్నది రైల్వే కాలనీ.ఇళ్ళన్నీ పక్క పక్కనే.గోడలు ఇళ్ళకు మాత్రమే,మా మనసులకి కాదు.

రామారావు గారు,వారి భార్యకవిత ,3 పిల్లలు.కవిత గారిది చక్కటి రూపం.
వాళ్ళ ఎదురింటిలో వెంకటయ్య గారు.రిటైరు అయ్యారు.4 అబ్బాయిలు
రామా రావు గారు పొద్దున్నే ఉద్యోగానికి వెళ్ళడం తో,వెంకటయ్య గారింట్లోనే కవిత కు కాలక్షేపం
 
ఈ క్రమం లో వెంకటయ్య గారి ఆఖరి అబ్బాయి కళ్యాణ్ తో సీతకి స్నేహం ఏర్పడింది. కవిత పిల్లలు కళ్యాణ్ ని “మావయ్య” అని పిలిచే వారు.
రామారావు పని వత్తిడి వలన ఎక్కడికైనా తీసుకువెళ్ళక పోతే కళ్యాణ్ , కవిత ను తీసుకెళ్ళే వాడు 
క్రమం గా వీళ్ళ స్నేహం పెరిగింది.అది ఎంత వరకు వచ్చింది అంటే,రామరావు,కవిత సంసార విషయాలను సైతం ఈ కళ్యాణ్ తో చర్చిండం వరకు.

ఈ స్నేహన్ని ఆ వీధిలో ఒక్కొక్కరూ ఒక్కో పేరుతో పిలిచే వారు. 

లోకుల మాటలు ఎందుకు నిజం చెయ్యకూడదు అన్న ఆలొచన కవిత కు కలిగింది.అదే సమయం లో మా ఊరిలో చిరు ఉద్యోగం చేస్తున్నా కళ్యాణ్ కు తిరుపతి లో రావడం తో అక్కడికి కవిత , కళ్యాణ్ చేరుకున్నారు.”

రామారావు ఆ ఊళ్ళో ఉండలేక వేరే ఊరు బదిలీ అయ్యారు.ప్రస్తుతం కవిత 3 పిల్లలు  కవిత తండ్రి దగ్గర
పెరుగుతున్నారు.
 
దిగజారుతున్న విలువలకు సజీవ దృశ్యం ఈ సంఘటన.
ఎవరి దారి వారు చూసుకున్నారు.మధ్యలో బలి అయ్యింది పసి పిల్లలు
పెళ్ళై,చక్కగా సంసారం,చక్కని పిల్లలూ ఉండి కూడా తాత్కాలిక ఆకర్షణను,కా(లో)కుల మాటలకు ఊతం ఇచ్చింది కవిత . 
పెళ్ళి కాక ముందు ఏది చేసినా అది పూర్తిగా వ్యక్తిగతం.పెళ్ళయ్యాక చేస్తే అది ఆ ఇద్దరికీ సంబంధించినది.పిల్లలు కలిగాక చేస్తే అది ఒక సంపూర్ణ కుటుంబానికి చెందినది
కవిత దృష్యా తను చేసింది ఒప్పే కావచ్చు.

కానీ మధ్యలో తమ భవిష్యత్తును పణం గా పెట్టింది అభం శుభం తెలియని పిల్లలు

తమ మధ్య స్వచ్చమైన స్నేహాన్ని పది మందీ తప్పుగా అనుకొని ఉండచ్చు.అయినంత మాత్రాన అది నిజం ఎందుకు చెయ్యాకూడదు అనుకోవడం,అదే నిజం చేసి అందరి ఊహలను నిజం చెయ్యడం తప్పు
 

Published in: on సెప్టెంబర్ 4, 2007 at 11:28 ఉద.  2 వ్యాఖ్యలు  

“హే రాం”-2

ఆయనో నినాదం,ఆయనో వివాదం

ప్రతి సంవత్సరం నోబెల్ బహుమత్తులో ప్రతి ఏట ఏ విభాగం గురించి ఆశపడక పొయినా,ప్రతి భారతీయుడు ఆయనకు రావాలని మనస్పూర్తిగా ప్రార్ధిస్తడు.రాక పోతే ఆ నోబెల్ బహుమత్తులో ఎదో రాజకీయం జరిగి ఉండి ఉంటుందని చూసినట్టు మల్లే వ్యాఖ్యానిస్తాం. 

ఆయన ఫోటోను ఇళ్ళల్లో దేవుడి పటాల పక్కన  పెట్టుకుంటాం

ఆయన మీద సినిమా వస్తే స్కూళ్ళకు శెలవు పెట్టించి మరీ పెద్దవాళ్ళు చూపిస్తారు.ఆయన మీద సినిమాకు ప్రభుత్వం ఏకం గా ఆర్ధిక సహాయం చేసేస్తుంది 
 
శాంతి కపోతం అనీ,ఈ శతాబ్దం లో అత్యంత ప్రభావితం చేసిన వాడని వేనోళ్ళా పూజిస్తాం

చీకటి కప్పేసిన వెలుగు ఆయన,ఆయన జీవిత చరిత్ర
ఆయనో వైరుధ్యం,ఆయనో వివాదం.
ఆయనో సిద్ధాంతం,ఆయనో వేదాంతం
(తెలిసేట్టు చెప్తే అది సిద్ధాంతం,అర్ధం కాకపోతే వేదాంతం)

ఆయనలో ఉండే మరో కోణన్ని వెలుగులోకి తెచ్చే చిన్న ప్రయత్నం ఈ వ్యాసం 

 http://www.andhrabhoomi.net/gandhi.html

Published in: on ఆగస్ట్ 19, 2007 at 6:13 ఉద.  2 వ్యాఖ్యలు  

“హే రాం!!”-1

ఆయన పేరు దేశభక్తికి మారు పేరు
మనం ఉగ్గు పాలతో ఆయన్ని జీర్ణించుకున్నాం
నిత్య జీవితం లో ఆయన పేరు ఎంచని భారతీయుడు లేడేమో(కనీసం జాతీయ దినోత్సవాలలో అయినా)..

మహాత్ముడనీ ,అహింసా మార్గం చూపించిన కలియుగ గౌతమ బుద్ధుడనీ , 
మన స్వాతంత్ర్య రథ సారథి గా,సత్యాగ్రహం పేరిట “రవి అస్తమించని సామ్రాజ్యాన్ని వణికించిన ” సర్వోత్కృష్టుడంటూ మన చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో రాసుకున్నాం

ఇదంతా నాణానికి ఒక వైపు….
ఇంకో వైపు ను ఆవిష్కరించి వక్రీకరించిన వాస్తవ చరిత్రను వెలుగులోకి తెచ్చే చిన్న ప్రయత్నం ఈ శీర్షిక
 

http://www.andhrabhoomi.net/gandhi.html

Published in: on ఆగస్ట్ 13, 2007 at 12:52 సా.  వ్యాఖ్యానించండి  

మొదటి మహిళ…not my choice,but by her chance!!!

కొందరంటే తెలియని అభిమానం
వాళ్ళని ఎప్పుడూ కలిసి ఉండం
మాట్లాడి ఉండం
దగ్గరి నుంచీ చూసి కూడా ఉండం
కలుస్తాము అన్న ఆశా ఉండదు

కానీ ఎందుకో వాళ్ళంటే ఇష్టం
వాళ్ళు టీ వీ లో వస్తే చాలు,పరిగెత్తు కుంటూ వస్తాం
పేపర్ లో వాళ్ళ వేలు పడ్డా కత్తిరించుకోని,మన గోడలకు అతికించుకుంటాం
వాళ్ళ మాట చెవులు రిక్కించి మరీ వింటాం
మనిషంటే ఇలా ఉండాలి రా అంకుంటాం

అలా నేను అనుకోనే వారిలో మొదటి వ్యక్తి “అబ్దుల్ కలాం”
రాష్త్రపతి అంటే ఇలా అని ఎప్పుడో చిన్నప్పుడు సాంఘిక శాస్త్రం లో చెప్పారు:ఇన్ని ఏళ్ళ వయసు నిండాలి,భారత పౌరుడు అయ్యి ఉండాలి,ఎటువంటి నేరచరిత్ర ఉండకూడదు,ఎటువంటి పార్టీ కీ చెంది ఉండకూడదు వగైరా(క్షమించాలి..ఆఖరి రెండూ ఇప్పుడు తప్పనిసరి,రాజ్యాంగాన్ని త్వరలో సవరించాలి)

తన పదవీ కాలం లో  రాష్ట్రపతి కి కొత్త నిర్వచనం చెప్పారు,”రబ్బర్ స్టాంపు”,పార్టీ అద్యక్షుడి చట్రం లాంటి పదాలను తిరగారిసింది బహుశా ఈయనేనేమో.

నిత్యం చిరునవ్వుతో భావి భారత పౌరులని ఉత్తేజితం చేస్తూ,శాస్త్ర విఙ్ఞానం పై నిరంతరం ఆశక్తి కలిగిస్తూనే ఉన్నారు.

అసలు రాష్ట్రపతి అంటే ఈయనేరా…అని ఎన్ని సార్లు అనుకున్నానో

తొలి మహిళా రాష్త్రపతి ఎన్నిక జరిగిన తీరు చూస్తే ఎందుకో  మనసు కల్లుక్కు మంది
సామాన్య పౌరుడి గళానికి విలువలేని ఈ ఎన్నిక ఎంత వరకు సబబు??
నా ప్రాంతపు ఎం ఎల్ ఏ కనీసం వోటు వెయ్యలేదు!

ఇక నాలాంటి వారి అభిప్రాయం(కనీసం కాగితం మీదైనా) పరిగణలో తీసుకోలేదు

అసలు రాష్ట్రపతి అంటే కచ్చితం గా ఎదో ఒక రాజకీయ పార్టీ అండ ఉండాలా??
రాజ్యాంగ నిపుణులో,దేశన్ని నిజం గా ముందుకు నడిపించే వారో  కాదా??అలాంటి వాది పేరు వినిపించినా ఎవరూ మదత్తు ఇవ్వరేమో!!

మహిళా సాధికారత,విలువల విజయం వంటి పదాల ముసుగులో,తన మీద ఉన్నా నేరాలను కనీసం ఖండిచలేని తొలి మహిళా రాష్ట్రపతీ……..నీకు నా ____(  మా సోనియా గాంధీ,ఇటలీ నుంచీ ఇంగ్లీషుకు,ఇంగ్లీషు  నుంచీ హిందీ కి,హిందీ నుంచి తెలుగులోకీ తర్జుమా చెయ్యించుకోని ఈ ఖాళీ ని పూరిస్తారు)
 
 

Published in: on జూలై 21, 2007 at 5:01 సా.  10 వ్యాఖ్యలు  

ఒక్క ఛాన్సు….ఒకే ఒక్క ఛాన్సు

ఈ మాట ఎప్పుడో అప్పుడు కచ్చితం గా అంతా అనుకునే ఉంటాం
అదో రంగుల ప్రపంచం
మనల్ని మనం చూసుకోవాలని,కనీసం మన పేరైనా దాని మీద చూసుకోవాలని ఎన్ని సార్లు అనుకున్నామో కదా!!

పొద్దునే పేపరు రాగానే మొదట తీసి చదివేస్తాం
అల్లంత దూరం లొ ,తెర మీద హీరో పాడుతుంటే పాడతాం,మన కోప్పాన్ని అంతా విలన్ మీద చూపిస్తె సీటు మీద మురిసిపోతాం.

మన అభిమాన హీరో సినిమా మొదటి ఆట చూసి,క్లాసులో కాలర్ ఎగరెయ్యాలని తహ తహ లాడతాం   

హీరో చేసిన రోమాంటిక్ సీన్లన్ని,పెద్దయ్యాక(వీలుంటే ఇప్పుడే)చెయ్యాలని ఉవ్విళ్ళూరతాం.

ఒక్క సారి నాకు అవకాశం వస్తేనా…అనుకుంటూ మనకు మనమే ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటాం.

ఒక్క సినిమా అవకాశం వస్తేనా….మన జన్మ జన్మల దరిద్రం తీరిపోతుంది,అబ్బా…ఈ సినిమా వోళ్ళు ఇంత దబ్బును ఏం చేసుకుంటారో కదా??

ఇలాంటి అంతర్మధానలు ఎన్ని సార్లో  

********************************************************
ఇదంతా నాణానికి ఒక వైపు
ఇంకో వైపు..

“అదృష్టం ” అన్న పదానికి కచ్చితమైన నిర్వచనం చెప్పే ఏకైక రంగం ఈ వెండి/చిన్ని తెర.
 
రోజు కో నటి(కాదు కాదు…. హీరోయిన్),ఒక్క సినిమాతో తళుక్కుమని రాలిపోయే తోకచుక్కలు ఇలా ఎన్నో మన కళ్ళ ముందు చూసాం…ఇక ముందు చూస్తాం కూడా

వీళ్ళంతా ఒక వైపు ఉంటే,ఇంకో వైపు సిని రంగలం లో అడుగు వేసీ వెయ్యని జూనియర్ ఆర్టిస్టులు

వీళ్ళ వెతలు అన్ని ఇన్నీ కావు
హీరో తో పాటు డాన్సులు వేస్తారు,హీరోలకు డూపులుగా వేసి నానా దెబ్బలు తగిలించుకుంటారు…
 
ఎదో ఒక రోజు తమకూ ఒక అవకాశం రాకపోదా అనుకునే నిరంతర ఆశావాదులు

ఒక వైపు హీరోలు కోట్లకు పడగలు ఎత్తుతుంటే,వీళ్ళ తలసరి ఆదాయం మాత్రం నెలకు 200,అదీ సినిమా ఉంటేనే!!!!

ఇరుకు అద్దిళ్ళు,నిండీ నిండని జానెడు పొట్టలు

 రంగుల ప్రపంచం చూసి,వాస్త జీవితాన్ని వదిలేసి,దూరపు కొండల వైపు పరుగులు తీసే యువతకు చెప్పేది ఒకటే……..తమ జీవితం ఇంకొకరికి రాకూడదనీ

“నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేనెగిరి పొతే
నిబిడాశ్చర్యంతో వీరు
నెత్తురు కక్కుకుంటూ నేలకు నే రలిపొతే
నిర్దాక్షిణ్యం గా  వీరె !!!”
 

Published in: on జూలై 17, 2007 at 12:51 సా.  Comments (1)  

Vote for Taj………bla bla blaaaa

మొన్నటి నుంచీ ఏ టీ వీ పేట్టినా ఒకటే గోల
మెయిలు చూసుకుందామనుకున్నా తాజ్ మహల్ కు కాదు ఇంకో గుడి కి ఓటు వెయ్యండి అనీ
క్లాసులో కూడా ఇదే
ఆఖరికి మా బంధువుల్లో కూడా ఇదే…

ఈ రోజే ఆఖరి రోజు వెంటనే వెయ్యవే అనీ మా బాబాయి ఫోను చేసీ మరీ చెప్పాడు

అసలు ఈ ఎన్నిక కథా కమీషు ఏంటో తెలుసుకుందామని ఇన్నాళ్ళు ఆగాను

నా అన్వేషణకు జవాబుగా మా సాక్షి లోగుట్టును బయట పెట్టాడు

http://www.indiapress.org/gen/news.php/Andhra_Bhoomi/400×60/0

Published in: on జూలై 7, 2007 at 3:55 ఉద.  వ్యాఖ్యానించండి  

Still dicrimination against HIV +ve

మీరట్…డిల్లీ కి కూత వేటు దూరం
ప్రభుత్వాసుపత్రి…..అదీ చుట్టు పక్కల ఆసుపత్రులలో మేలైనది

నిన్న కేరళా……నేడు మీరట్
అదే వివక్షత..
నిన్న లోకం పోకడు చూస్తున్న చిన్నారుల మీద
నేడు లోకం లో రావడానికీ ప్రయత్నించిన పసి బిడ్డ మీద

ఎయిడ్స్ మహమ్మారి ఇంకా పూర్తిగా ఆవహించని నిండు చూలాలు
ఆసుపత్రి లో కనీస సౌకర్యాలు లేవన్న సిబ్బంది

అలాంటి సమయం లో భర్త అన్న పదానికి సిసలైన అర్ధం చెప్పాడు ఆమె మగడు.

ఎటువంటి శస్త్ర పరిఙ్ఞానం లేక పొయినా సాహసించి తన బిడ్డను భూమి మీదకు తెచ్చాడు.

ఆర్టికల్ 14 ,15 అందరికీ సమానత్వం అన్న హక్కును ప్రసాదించింది
ఇటీవలే  జారి అయిన ఎయిడ్స్ 2005 బిల్లు ,ఎయిడ్స్ బారిన పడిన వారికి వివక్షత లేని విద్య,వైద్యం,ఉపాధి రంగాలను అందించాలని చట్టం చేసింది

కానీ ఇందులో వివక్షత చూపేవారిపై ఎటువంటి చర్యలుంటాయి అన్న అంశం లేదు.

ప్రభుత్వ ధనం,ఎన్నో స్వచ్చంధ సంస్థలు,ప్రచార సాధనాల నిరతర కృషి ఉన్నా ఎక్కడో ఇంకా లోపం

సిగ్గు పాడల్సిన సంగతేంటంటే…..వ్యాధి మీద పూర్తి అవగాహన కలిగిన డాక్టర్లు సైతం వివక్షల చూపడం!!!

  

Published in: on జూన్ 30, 2007 at 7:40 ఉద.  2 వ్యాఖ్యలు