Average Days…..Happy days

చాలా కాలానికి సినిమా చూసాను.విచిత్రం ఏంటీ అంటే ఆ దర్శకుడి తదుపరి చిత్రం విడుదలకు ముందే నేను చూడడం ఇక విషయానికి వస్తే…హాపీ డేస్
ఆనంద్,గోదావరి చిత్రాలు చూసి,మనసు పడి శేఖర్ చిత్రాల మీద కొన్ని అంచనాలు ఏర్పరచుకున్నాను.
నా అత్యాశో,లేక ఆ చిత్రం తీసినతీరో తెలియదు ఈ చిత్రం ఎందుకో నన్ను నిరాశ పరిచింది

చిత్రానికి ముందు విడుదల అయిన  పాటలు విని చక్కని,చిక్కని సాహిత్యం కోసం వెదికాను,ఇక సరే కాలేజీ నేపధ్యం ఉన్న చిత్రం కదా అని సరిపెట్టుకున్నాను

ఇక సినిమా సంగతికి వస్తె……ఇంజనీరింగు మొదటి  సంవత్సరం తో మొదటి భాగం మొత్తం సాగింది(బాగా సాగతీసాడు శేఖర్) .
 
మొదటి రోజు కాలేజీ అనుభావలని చక్కగానే చూపించాడు.కొత్త కొత్త స్నేహాలు,ఇంజనీరింగు చేరామనే గర్వం,సీనియర్ల తో చిన్న చిన్న గొడవలు,మొదటి సారి అమ్మయి తాకిన అనుభూతి, మొదటి ప్రేమకోసం తపించడం,అప్పుడు కలిగే ఆకర్షణ,అందమైన టీచరు మీద కలిగే చిలిపి భావనా వంటివి.ఇంటర్వెల్ కి ముందు మాత్రం హడావుడిగా మొదటి సంవత్సరాన్ని పరీక్షలు రాసేసాం అని ఒక్క ముక్కలో చెప్పి ముగించాడు.
వాస్తవం లో కూడ మొదటి సంవత్సరం రాగింగ్ హడావుడితో త్వరగానే ముగుస్తుంది.
 
ఇక రెండో భాగం మొత్తం అంతా తమ తమ అమ్మాయిలను పొందడమే పరమావధిగా సాగింది.

అందులో భాగం గా కొన్ని ఇబ్బందికర సన్నివేశలు కనిపించాయి. 
వాస్తవం లో అలాంటివి జరిగినా,ఇలాంటి శక్తి వంతమైన మాధ్యమాల ద్వార చూపించేముందు దర్శకులు ఆలోచించాలి

గొదావరి,ఆనంద్ వంటి “క్లీన్” చిత్రాలను తీసిన కమ్ముల చిత్రాలలో ఇలాంటి సన్నివేశలు చూసి ఇబ్బంది కలిగించింది

చిత్రం లో మిక్కీ మేయర్ సంగీతం బాగుంది.బాక్ గ్రౌండ్  కూడా బాగుంది

సినిమా లో ఆఖరున తప్ప,ఎక్కడా “కెరీర్” గురించి ధ్యాస కనిపించదు.ఇంజనీరింగు భాగం లో ముఖ్యమైన “ప్రాజెక్ట్” మరిచాడేమో!!

అఖరున “ఉద్యోగాలు” ఇప్పించక పోతే బాగోదు అనుకుని,”విప్రో” వాళ్ళని పిలిపించారు.

ప్రేమ వగైరా సన్ని వేశాలను నిశితం గా చూపించిన శేఖర్,అంతే ఇదిగా పాఠాల పట్ల,భవిష్యత్తు పట్ల అంకితభావాన్ని చూపించి ఉంటే  యువతకి చక్కటి మార్గదర్శకం గా ఉంటుంది
సినిమా అన్నది కేవలం వినోదం కోసమే కాదు,సామాజిక స్పృహ ఉంటే కళ యొక్క ముఖ్య ఉద్దేశ్యం నెరవేరి నట్లే…….
 

ఒక్క ముక్కలో చెప్పాలంటే “కొత్త సీసాలో పాత సారాయి” చందం గా అనిపించింది.

Published in: on నవంబర్ 11, 2007 at 5:25 సా.  10 వ్యాఖ్యలు  

జీ టీ వీ “స రి గ మ ప”….సుస్వరాల హంగామ

నిన్న ఆదివారం తో చిన్న పిల్లల అధ్యాయం ముగిసింది.
ఏంటో ప్రతి గురు,శుక్ర వారాలు ఈ కార్యక్రం కోసం ఎదురు చూడడం అలవాటు అయ్యింది.
ఒక్క సారిగా ఇంత అభిమానాన్ని చూరగొన్న  ఈ కూనలు  మళ్ళీ పాడరు అన్న విషయం జీర్ణించుకోవడానికి కాస్త సమయం పట్టేలా ఉంది..అద్రుష్టవశాత్తు బాలు గారి “పాడలని ఉంది” వెనువెంటనే చిన్న పిల్లల అధ్యాయం మొదలు పెట్టడం  ఈ రత్నాలకు మర్రిన్ని మెరుగులు దిద్దడమే !

కారుణ్య పర్యవేక్షణనుంచీ బాలుగారీ పర్యవేషణకు మారడం ఈ పిల్లల పూర్వ జన్మ సుకృతమే!
 
ఈ కార్యక్రమం మొదలైన దగ్గరినుంచీ ప్రతి ఆధ్యాయం చూస్తున్నా.వాళ్ళను కన్న తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులో అని ప్రతి సారీ అనుకున్నా.

బడిలో ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకుంటున్న వీరు అంత పెద్ద పాటలని మర్చిపోకుండా అంత మంది ముందు పాడడం చూసి  ఆశ్చర్యం వేసింది.

 ఈ సారి ముందు నిలచిన సాయి దేవ హర్ష పాటవింటే అందరికీ ఇదే అనిపిస్తుంది.8 ఏళ్ళ చిన్ని బాబు,ఎక్కడా శృతి తప్పకుండా,పెద్ద పెద్ద సమాసాలను,పద్యాలను చేతిని తిప్పుతూ పాడాడు.

రెండో స్థానం లో నిలచిన “భువన కృతి”,ఆ తరువాతి స్థానాలలో ఉన్న”శరత్ సంతోష్” “అనిరుధ్”,”సత్య యామిని” మొదలైన వారు ఎదో చిన్న తప్పులు చేసి వెళ్ళారు తప్ప,అంతా మొదటి స్థానానికి పూర్తి అర్హత గల వారే.

ముఖ్యం గా నాకు అందరి కన్నా “అనిరుధ్” తెగ నచ్చేశాడు.
సాధారణం గా పోటీ సంగీత కార్యక్రమాలలో ఎవరూ పాడని “జయభేరి” చిత్రం లోని “రసి క రాజ తగువారము కాదా..ఏలు దొరవు అరమరికలు లేక..” అన్న పాట ఈ  అబ్బాయి పాడిన తీరు నన్ను ఈ అబ్బాయి అభిమానిగా మార్చేసింది.
ఈ పాట సంగీతం తో నిష్ణాతులకు తప్ప అన్యులకు కొరగాదు.అలాంటి పాటను ఈ అబ్బాయి  ఒక్క గమకం కూడా వదలకుండా,ఎక్కడా పక్కకు పోకుండా పాడడం నిజంగా చాలా  చాలా great

చాలా రోజులు నుంచీ నేను మన పాత పాటలు నేటి తరానికి అందవేమో అనుకున్నాను.ఈ కార్యక్రమం చూసాక ఆ భయం పోయింది.ఎన్నో మరుగున దాగిన ఆణిముత్యాలు వెలుగులోకి వచ్చాయి. 

ఇంకా ఆనందించదగ్గ విషయం ఏంటి అంటే…దీనిని నడిపిస్తున్న “కారుణ్య” చక్కగా తెలుగులో మాట్లాడడం.కార్యక్రమం మొదట్లో “కారుణ్య”వాడిన  తెలుగు సొబగులు,కార్యక్రమం మీద ఆశక్తి రేపింది.న్యాయనిర్ణేతలుగా వచ్చిన ‘కోటి”,”శైలజ”,రమణ గోగుల” తమ పాత్రలని చక్కగా నిర్వహించారు.

పంటికింద రాయిలా ఈ కార్యక్రమం ఆఖరి భాగం గా అనిపించింది.అంత హంగామా,మధ్యలో దేవి శ్రీ ప్రసాద్ పిచ్చి గెంతుళ్ళు ఎబ్బేట్టు గా అనిపించింది.
లేత మనసులకి అంత బహుమతులు ఇవ్వడం వల్ల దాని ప్రభావం తీవ్రం గా ఉంటుందేమో.మొదటి ముగ్గురికీ 50వేలకు పైగా ఇస్తూ,అంతే స్థాయి లో పాడిన మొదటి 5 వారికి ఏమీ ఇవ్వక పోవడం కాస్తంత బాధ గా అనిపించింది.

దీన్లో మొదటి 10 మందికి స్తేజి మీద,అందరి ముందూ ఇస్తే ఎంతో ప్రోత్సాహకరం గా ఉండేది.

అంత హంగామా మధ్య ఈ కార్యక్రమాన్ని జరిపేబదులు simple గా చేసి ఉంటే బాగుండేదేమో.కార్యక్రమం ఆద్యంతమూ sponsors  వల్ల నడుస్తుండడం వల్ల అడ్డు చెప్పలేం.

SMS పద్దతి కాకుండా నిష్ణాతులైన వారిని న్యాయ నిర్ణేతలుగా నియమించి ఉంటే బాగుండేదేమో.

వ్యక్తిగతం గా నేను సాయి దేవ హర్షకు మొదటి స్థానం రావడం అంగీకరించను

ఆ అబ్బాయి అంత చిన్న వయసులో కలిగిన గ్రహణ శక్తి నిర్వివాదశం

తను పాడిన పాటల్లో శాస్త్రీయ సంగీతం పాలు తక్కువ
 
శాస్త్రీయ సంగీతం లో మంచి పట్టు కలిగింది తరువాతి స్థానం లో ఉన్న శరత్,అనిరుధ్,భువన.

అనిరుధ్ ముఖం లో భయం ప్రస్పుటం గా ప్రతి సారీ కనిపించింది
అది తగ్గించుకుంటే భవిష్యత్తులో మంచి గాయకుడు అవ్వగలడు  

గెలుపూ ఓటములు పక్క పెడితే ప్రతి ఒక్కరి గళం ఈ పోటీ వల్ల చాలా మెరుగులు దిద్దింది అన్నది మాత్రం నిజం

ఇలాంటి కార్యక్రామల కోసం  అయినా నేటి తరం శాస్త్రీయ సంగీతం వైపు దృష్టి సారిస్తుందేమో!

ప్రతి భాగం లో పిల్లల కల్మషం లేని మనసు ప్రస్పుటం గా కనిపించింది.తమ మధ్య ఇంత వరకు పాడిన స్నేహితుడు వెళ్ళి పోవడం చూసి ఆ పసి మనసులు కన్నీళ్ళు పెట్టుకోడం చూసి నా కన్నీళ్ళూ ఆగలేదు. అందుకే కదా పసిపిల్లలు దేవుడితో సమానం అంటారు.మనం పెరిగే కొద్దీ ఆ కల్మషమే హరించుకుపోయి “పక్క వాడికంటే ముందు ఉండాలి” అన్న ఆలోచనతో మొదలయ్యి ఈర్ష్య ,ద్వేషం గా కొనసాగి “ఆఖరికి పక్కవాడిని ముంచే” స్థాయికి చేరుతుందేమో!!

  

Published in: on సెప్టెంబర్ 11, 2007 at 4:04 సా.  4 వ్యాఖ్యలు  

రసాలూరి రాజేశ్వరుడు!!

అనుకోకుండా ఒక మితృడి ద్వారా సాలూరి రాజేశ్వర రావు గారు స్వయం గా పాడిన పాటల గొళ్ళెం దొరికింది
http://www.tlca.com/adults/saluri.html

“పాడమని నన్నడగతగునా….” అంటూ దాసరథి గీతాం ఎందుకో తెగ నచ్చేసింది.

“పొదలమాటున పొంచి పొంచి ఎదను దోచిన వేణు గానము,ఒలక బోసిన రాగసుధ కు,మొలకలెత్తిన మథుర గీతి….”
” ఎవరూ లేని,యమునా తటినీ,ఎక్కడో ఏకాంత మందున…..మథుర గీతి……”

నిజమే ఇంతకన్నా మథుర గీతి ఎక్కడైనా ఉందా???

రజేశ్వర రావు గారి స్వరం ఘంటసాల అంత మాథుర్యం గా లేకున్నా….కానీ ఏదో ఉంది.
పీలగా గా సాగే ఆలాపన  పక్కనే సన్నగా హార్మోనియం,దానికి తాళం వేస్తూ తబలా..అంతే…ఇంకేం పెద్ద వాయిద్యాలు లేవు….అయినా రెండు రోజులు మా ఇంట్లో ఏకధాటిగా ఈ పాట అలా ఆడుతూనే ఉంది.

Published in: on జూన్ 14, 2007 at 12:21 ఉద.  వ్యాఖ్యానించండి