Average Days…..Happy days

చాలా కాలానికి సినిమా చూసాను.విచిత్రం ఏంటీ అంటే ఆ దర్శకుడి తదుపరి చిత్రం విడుదలకు ముందే నేను చూడడం ఇక విషయానికి వస్తే…హాపీ డేస్
ఆనంద్,గోదావరి చిత్రాలు చూసి,మనసు పడి శేఖర్ చిత్రాల మీద కొన్ని అంచనాలు ఏర్పరచుకున్నాను.
నా అత్యాశో,లేక ఆ చిత్రం తీసినతీరో తెలియదు ఈ చిత్రం ఎందుకో నన్ను నిరాశ పరిచింది

చిత్రానికి ముందు విడుదల అయిన  పాటలు విని చక్కని,చిక్కని సాహిత్యం కోసం వెదికాను,ఇక సరే కాలేజీ నేపధ్యం ఉన్న చిత్రం కదా అని సరిపెట్టుకున్నాను

ఇక సినిమా సంగతికి వస్తె……ఇంజనీరింగు మొదటి  సంవత్సరం తో మొదటి భాగం మొత్తం సాగింది(బాగా సాగతీసాడు శేఖర్) .
 
మొదటి రోజు కాలేజీ అనుభావలని చక్కగానే చూపించాడు.కొత్త కొత్త స్నేహాలు,ఇంజనీరింగు చేరామనే గర్వం,సీనియర్ల తో చిన్న చిన్న గొడవలు,మొదటి సారి అమ్మయి తాకిన అనుభూతి, మొదటి ప్రేమకోసం తపించడం,అప్పుడు కలిగే ఆకర్షణ,అందమైన టీచరు మీద కలిగే చిలిపి భావనా వంటివి.ఇంటర్వెల్ కి ముందు మాత్రం హడావుడిగా మొదటి సంవత్సరాన్ని పరీక్షలు రాసేసాం అని ఒక్క ముక్కలో చెప్పి ముగించాడు.
వాస్తవం లో కూడ మొదటి సంవత్సరం రాగింగ్ హడావుడితో త్వరగానే ముగుస్తుంది.
 
ఇక రెండో భాగం మొత్తం అంతా తమ తమ అమ్మాయిలను పొందడమే పరమావధిగా సాగింది.

అందులో భాగం గా కొన్ని ఇబ్బందికర సన్నివేశలు కనిపించాయి. 
వాస్తవం లో అలాంటివి జరిగినా,ఇలాంటి శక్తి వంతమైన మాధ్యమాల ద్వార చూపించేముందు దర్శకులు ఆలోచించాలి

గొదావరి,ఆనంద్ వంటి “క్లీన్” చిత్రాలను తీసిన కమ్ముల చిత్రాలలో ఇలాంటి సన్నివేశలు చూసి ఇబ్బంది కలిగించింది

చిత్రం లో మిక్కీ మేయర్ సంగీతం బాగుంది.బాక్ గ్రౌండ్  కూడా బాగుంది

సినిమా లో ఆఖరున తప్ప,ఎక్కడా “కెరీర్” గురించి ధ్యాస కనిపించదు.ఇంజనీరింగు భాగం లో ముఖ్యమైన “ప్రాజెక్ట్” మరిచాడేమో!!

అఖరున “ఉద్యోగాలు” ఇప్పించక పోతే బాగోదు అనుకుని,”విప్రో” వాళ్ళని పిలిపించారు.

ప్రేమ వగైరా సన్ని వేశాలను నిశితం గా చూపించిన శేఖర్,అంతే ఇదిగా పాఠాల పట్ల,భవిష్యత్తు పట్ల అంకితభావాన్ని చూపించి ఉంటే  యువతకి చక్కటి మార్గదర్శకం గా ఉంటుంది
సినిమా అన్నది కేవలం వినోదం కోసమే కాదు,సామాజిక స్పృహ ఉంటే కళ యొక్క ముఖ్య ఉద్దేశ్యం నెరవేరి నట్లే…….
 

ఒక్క ముక్కలో చెప్పాలంటే “కొత్త సీసాలో పాత సారాయి” చందం గా అనిపించింది.

Published in: on నవంబర్ 11, 2007 at 5:25 సా.  10 వ్యాఖ్యలు  

The URI to TrackBack this entry is: https://vaagdevi.wordpress.com/2007/11/11/average-dayshappy-days/trackback/

RSS feed for comments on this post.

10 వ్యాఖ్యలువ్యాఖ్యానించండి

 1. బాగా చెప్పారు. నాకూ సినిమా కాస్త అటూ ఇటూగా అలానే అనిపించింది. ఖచ్చితంగా గోదావరి/ఆనంద్ స్థాయి కాదు. కానీ, ఈ సినిమాకి టార్గెట్ ఆడియన్స్ వేరే కదండీ. ఆ కాటగిరీలో సినిమా బాగానే నడిచింది. దానికి తోడు మిగిలిన సినిమాలన్నీ చెత్తవవటం కూడా కలిసొచ్చింది.

 2. మీ విమర్శ బాగానే వుంది కానీ, మరీ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించారు. హ్యాపీ డేస్ మరీ శేఖర్ కమ్ముల ఆనంద్ స్థాయిలో లేకపోయినా కాలేజీలలో జరిగే సన్నివేశాలను కల్లకు కట్టేలా వుంది. అతనికి కొంత భాద్యత వుండబట్టే వెకిలు హాస్యాలు, లెక్చరర్ల మీద జోకులు వెయ్యలేదు.

 3. సినిమా పర్వాలేదు అనిపించాడు శేఖర్.మెచ్చుకోతగ్గ విషయం ఏంటి అంటే లెక్చరర్లను జోకర్లగా చిత్రీకరించక పోవడం
  ఇతర ఏ సినిమా ఈ మాత్రం లేక పోవడం ఈ సినిమాకు బాగా కలిసొచ్చింది
  దీన్ని బట్టీ ఇతర సినిమాల స్థాయి అర్థం చేసుకోవచ్చు

 4. ౧) ఏఁవిటోనండీ ఆనంద్ అందరికీ తెగ నచ్చేస్తుంది, నాకది బోర్ అనిపిస్తుంది, సినిమా చూసాక, ఏం చూసానో గుర్తుకురాలేదు.
  డాలర్ డ్రీమ్స్ చూడండి, వీటన్నిటికంటే ఇంకా బాగుంటుంది.
  ౨) మా తమ్ముడు హైదు లో ఇంజు చదువుతున్నాడు. వాడినడిగా ఎలా వుందిరా హ్యాహీడేస్ అని. “అది college life కాదు bull shit. అక్కడ చూపించిందేమీ కాలేజిలో జరగదు” అన్నాడు. నేనూ కొంత వరకూ వాడితో ఏకీభవించక తప్పలేదు.
  ౩) ముఖ్యమైన విషయం
  మీరంటున్న ఇబ్బందికర మైన సన్నివేశం, ఈతరం వారు చాలా విరివిగా చేసేవేనని అందరూ అంటున్నారు. కాబట్టి చూపించడంలో తప్పులేదు. పైగా శేఖర్ అలాంటి వాళ్లను negative గా చూపించడం ఒక విధంగా, తన సాంఘిక బాధ్యతను సవ్యంగానే నెరవేర్చినట్లు అయ్యింది.

  మీరు ప్రాజెక్టు ముఖ్యమైనది అంటే మా ప్రాజెక్టు గుర్తొచ్చి నవ్వొస్తుంది. మేము గైడును కలసింది సంవత్సరంలో మూడు సార్లే! ప్రాజెక్టు చేసింది నేనొకణ్ణే, అదీను వారం రోజులే. చాలా మంచి మార్కులు కూడా వచ్చాయి 🙂
  అహ్ ఇండియన్ ఎడుకేషన్ సిస్టమ్ (ఆర్ ద లాక్ ఆఫ్ ఇట్)!

 5. గోదావరి నిజం గా చాలా బావుంది …. అందులో ఏ సందేహమూ లేదు ….
  హాపి డేస్ …బావుంది కానీ శేఖర్ కమ్ములా గారీ చిత్రంగా మాత్రం లేదు అన్నది మాత్రం నిజం … నేను ఓ వంది సమాధానాలు చేర్చి చెప్పిన commment….

 6. నిజానికి శేఖర్ కమ్ముల సినిమాలు అన్నీ నార్మల్ సినిమాలే నా దృష్టి లో…డాలర్ డ్రీంస్ తప్ప… కానీ… మన తెలుగు సినిమా దౌర్భాగ్యానికి….అంత కన్నా మంచి సినిమాలకి దిక్కులేదు కనుక…ఓ ఆనంద్…ఓ గోదావరి రాగానే మనం మంచి కాఫీ తాగినట్లో… వేసవి చల్లబడ్డట్లో ఫీలౌతూ ఉంటాం… బాలేవు అని అనడం లేదు నేను..బానే ఉంటాయి కానీ.. హైప్డ్ మూవీస్. హ్యాపీ డేస్…. “జిల్ జిల్ జింగా” పాట సాహిత్యం ఒక్కటి వందశాతం రియల్ గా అనిపించింది..నా ఇంజినీరింగ్ రోజులకి వెళ్ళాను…ఎన్ని సార్లు దాన్ని విన్నానో లెక్కలేదు… సినిమా ఓవర్ ఆల్ గా ఏం పెద్ద గొప్ప సినిమా కాదు…కాలేజీ సినిమా అయినా క్లీన్ గా ఉంది..అంతే. శేఖర్ కమ్ముల కి జనాల నాడి అర్థమైనట్లుంది… అతను కమర్షియల్ డైరెక్టర్… తన సినిమా అన్నది ఫ్లాప్ అయ్యే అవకాశం చూసుకుంటాడు…అంతే…. మన సినిమాల పరిస్థితి కి అతని సినిమాలే జనాలకి క్లాసిక్స్ అనిపిస్తున్నాయి… 🙂

 7. అవ్ మల్లా.. గీ సీన్మాల సుపిచ్చిన సీన్లు.. సాలమట్కి నిజంగ జర్గయ్ అనిపిచ్చింది నాగ్గూడ.. అదెందొ గని, మా ఆపిస్ల ఒ పొరడున్నడు, గాంది గీ మధ్యనే ఇంజనీరింగ్ అయిపొయ్నది.గాసిన్మా సూస్నగాడ్కెల్లి ఆడు ఓ తెగ ఇదై పోతన్నడు. ఆడనె గాదు, మా మేనేజర్ ఒకయ్నున్నడు గాయనగూడ ఆయన కాలేజి రోజులు గుర్తుకొచ్చినై అన్నడు.గప్పుడనిపిచ్చింది,గిది depends అని.. ఏమంటరు…?

 8. Yep, I think project is the only thing that is missing. But other than that I felt the movie was good and as are the songs :).

  @Rajeshwara Rao gaaru,
  When we think of US univs, we think of an MIT or Stanford. Then if its about Indian education system, think of an IISc or IITs or IIITH. People slog in there but still don’t manage to come out :). There is much to write on this one, but I need to stop it here – not my blog isn’t it 🙂

 9. ఈ సినిమా చూడకూడదన్న నా అభిప్రాయాన్ని యింకా యింకా బలపరిచేలా వున్నై యివన్నీ. నిజానికి నాకు ఆనందూ గోదావరీ కూడా అంతగా నచ్చలేదు. ఒక కథా పాడూ యేఁమ్హీ వుండదు. ఒక్క విషయంలో మాత్రం మెచ్చుకోవాలి… అనవసరమైన డిష్షుండిష్షుంలు మాత్రం ఇప్పటివరకూ లేవు శేఖర్ సినిమాలలో. సంగీతం melodious గానే వుంటుంది… సాహిత్యం యేమో ఆనందూ గోదావరిలలో మాత్రం చెత్తగా లేదు (ఎంతైనా వేటూరివారి కలం కదా). నేను హేఁపీ డేస్ లో పాటలు వినలేదు యిప్పటివరకూ. కాబట్టి దానిగురించి మాట్లాడే అర్హతా యోగ్యతా నాకు లేవు. అన్నట్టు నాకొక్క అనుమానంకూడా… అసలు యీయన ఆ కమలినీముఖర్జీనే యెందుకు పట్టుకు వేళ్లాడతాడూ అని. యేఁమి? ఆవిడగారు కాకపోతే వేరే యెవ్వరూ లేరటనా??? ఈ సినిమాలో కూడా ఆవిడ వుందటగదా! పెద్దహీరోలుగా నేటికాలంలో చెలామణీ అయిపోతున్నవాళ్లనెవ్వరినీ పెట్టి తీయకపోవటం నాకు నచ్చిన మరో అంశం. ఇక పోతే… (ఎవరు పోతే అని అడగకండేఁ!) చివరాఖరికి నేను తేల్చినదేమిటంటే యీయన తీసిన సినిమాలు చూస్తే DVD print వచ్చాకా, యే computerలోనో పెట్టుకు చూస్తే సరిపోతుందీ… theatreకి వెళ్లి చూసేంత సీను వాటికి లేదని. కళ్లు తెరిపించినందులకు మళ్లీ కృతజ్ఞతలు.

  మనలోమనమాట: మా మిత్రుల్లో కొందరు బడుద్ధాయిలు హీరోయిన్ బాగుందని యీ సినిమాకి వెళ్లార్ట!!!

 10. నాకు గోదావరి చిత్రం బాగా నచ్చింది
  సాహిత్యం ఇక వేటూరి కబట్టి,దాని గురించి మాట్లాడె అర్హత నాకు లేదు

  కమిలిని శెఖర్ కి చాల ఇష్టమైన హీరోయిన్ అట.కాబట్టి ప్రతి దాన్లో ఉంటుంది.ఈ సినిమాలో ఎదో చిన్న పాత్ర చేసింది లే.నాకు నచ్చలేదనుకో

  శెఖర్ సినిమాలలో మిగిత సినిమాలలగా చెత్త ఉండదు.అది మెచ్చుకో తగినది.

  ఇక మనలో మాట విషయానికి వస్తే:
  అయ్యొ…..పిచ్చి నా తమ్మీ…నీ స్నేహ బడుద్ధాయులు హీరోయిన్ బాగుందని వెళ్ళారు,మా వాళ్ళు ముమైత్ ఖాన్ లేదని వెళ్ళలేదు 🙂


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: