నిన్న ఆదివారం తో చిన్న పిల్లల అధ్యాయం ముగిసింది.
ఏంటో ప్రతి గురు,శుక్ర వారాలు ఈ కార్యక్రం కోసం ఎదురు చూడడం అలవాటు అయ్యింది.
ఒక్క సారిగా ఇంత అభిమానాన్ని చూరగొన్న ఈ కూనలు మళ్ళీ పాడరు అన్న విషయం జీర్ణించుకోవడానికి కాస్త సమయం పట్టేలా ఉంది..అద్రుష్టవశాత్తు బాలు గారి “పాడలని ఉంది” వెనువెంటనే చిన్న పిల్లల అధ్యాయం మొదలు పెట్టడం ఈ రత్నాలకు మర్రిన్ని మెరుగులు దిద్దడమే !
కారుణ్య పర్యవేక్షణనుంచీ బాలుగారీ పర్యవేషణకు మారడం ఈ పిల్లల పూర్వ జన్మ సుకృతమే!
ఈ కార్యక్రమం మొదలైన దగ్గరినుంచీ ప్రతి ఆధ్యాయం చూస్తున్నా.వాళ్ళను కన్న తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులో అని ప్రతి సారీ అనుకున్నా.
బడిలో ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకుంటున్న వీరు అంత పెద్ద పాటలని మర్చిపోకుండా అంత మంది ముందు పాడడం చూసి ఆశ్చర్యం వేసింది.
ఈ సారి ముందు నిలచిన సాయి దేవ హర్ష పాటవింటే అందరికీ ఇదే అనిపిస్తుంది.8 ఏళ్ళ చిన్ని బాబు,ఎక్కడా శృతి తప్పకుండా,పెద్ద పెద్ద సమాసాలను,పద్యాలను చేతిని తిప్పుతూ పాడాడు.
రెండో స్థానం లో నిలచిన “భువన కృతి”,ఆ తరువాతి స్థానాలలో ఉన్న”శరత్ సంతోష్” “అనిరుధ్”,”సత్య యామిని” మొదలైన వారు ఎదో చిన్న తప్పులు చేసి వెళ్ళారు తప్ప,అంతా మొదటి స్థానానికి పూర్తి అర్హత గల వారే.
ముఖ్యం గా నాకు అందరి కన్నా “అనిరుధ్” తెగ నచ్చేశాడు.
సాధారణం గా పోటీ సంగీత కార్యక్రమాలలో ఎవరూ పాడని “జయభేరి” చిత్రం లోని “రసి క రాజ తగువారము కాదా..ఏలు దొరవు అరమరికలు లేక..” అన్న పాట ఈ అబ్బాయి పాడిన తీరు నన్ను ఈ అబ్బాయి అభిమానిగా మార్చేసింది.
ఈ పాట సంగీతం తో నిష్ణాతులకు తప్ప అన్యులకు కొరగాదు.అలాంటి పాటను ఈ అబ్బాయి ఒక్క గమకం కూడా వదలకుండా,ఎక్కడా పక్కకు పోకుండా పాడడం నిజంగా చాలా చాలా great
చాలా రోజులు నుంచీ నేను మన పాత పాటలు నేటి తరానికి అందవేమో అనుకున్నాను.ఈ కార్యక్రమం చూసాక ఆ భయం పోయింది.ఎన్నో మరుగున దాగిన ఆణిముత్యాలు వెలుగులోకి వచ్చాయి.
ఇంకా ఆనందించదగ్గ విషయం ఏంటి అంటే…దీనిని నడిపిస్తున్న “కారుణ్య” చక్కగా తెలుగులో మాట్లాడడం.కార్యక్రమం మొదట్లో “కారుణ్య”వాడిన తెలుగు సొబగులు,కార్యక్రమం మీద ఆశక్తి రేపింది.న్యాయనిర్ణేతలుగా వచ్చిన ‘కోటి”,”శైలజ”,రమణ గోగుల” తమ పాత్రలని చక్కగా నిర్వహించారు.
పంటికింద రాయిలా ఈ కార్యక్రమం ఆఖరి భాగం గా అనిపించింది.అంత హంగామా,మధ్యలో దేవి శ్రీ ప్రసాద్ పిచ్చి గెంతుళ్ళు ఎబ్బేట్టు గా అనిపించింది.
లేత మనసులకి అంత బహుమతులు ఇవ్వడం వల్ల దాని ప్రభావం తీవ్రం గా ఉంటుందేమో.మొదటి ముగ్గురికీ 50వేలకు పైగా ఇస్తూ,అంతే స్థాయి లో పాడిన మొదటి 5 వారికి ఏమీ ఇవ్వక పోవడం కాస్తంత బాధ గా అనిపించింది.
దీన్లో మొదటి 10 మందికి స్తేజి మీద,అందరి ముందూ ఇస్తే ఎంతో ప్రోత్సాహకరం గా ఉండేది.
అంత హంగామా మధ్య ఈ కార్యక్రమాన్ని జరిపేబదులు simple గా చేసి ఉంటే బాగుండేదేమో.కార్యక్రమం ఆద్యంతమూ sponsors వల్ల నడుస్తుండడం వల్ల అడ్డు చెప్పలేం.
SMS పద్దతి కాకుండా నిష్ణాతులైన వారిని న్యాయ నిర్ణేతలుగా నియమించి ఉంటే బాగుండేదేమో.
వ్యక్తిగతం గా నేను సాయి దేవ హర్షకు మొదటి స్థానం రావడం అంగీకరించను
ఆ అబ్బాయి అంత చిన్న వయసులో కలిగిన గ్రహణ శక్తి నిర్వివాదశం
తను పాడిన పాటల్లో శాస్త్రీయ సంగీతం పాలు తక్కువ
శాస్త్రీయ సంగీతం లో మంచి పట్టు కలిగింది తరువాతి స్థానం లో ఉన్న శరత్,అనిరుధ్,భువన.
అనిరుధ్ ముఖం లో భయం ప్రస్పుటం గా ప్రతి సారీ కనిపించింది
అది తగ్గించుకుంటే భవిష్యత్తులో మంచి గాయకుడు అవ్వగలడు
గెలుపూ ఓటములు పక్క పెడితే ప్రతి ఒక్కరి గళం ఈ పోటీ వల్ల చాలా మెరుగులు దిద్దింది అన్నది మాత్రం నిజం
ఇలాంటి కార్యక్రామల కోసం అయినా నేటి తరం శాస్త్రీయ సంగీతం వైపు దృష్టి సారిస్తుందేమో!
ప్రతి భాగం లో పిల్లల కల్మషం లేని మనసు ప్రస్పుటం గా కనిపించింది.తమ మధ్య ఇంత వరకు పాడిన స్నేహితుడు వెళ్ళి పోవడం చూసి ఆ పసి మనసులు కన్నీళ్ళు పెట్టుకోడం చూసి నా కన్నీళ్ళూ ఆగలేదు. అందుకే కదా పసిపిల్లలు దేవుడితో సమానం అంటారు.మనం పెరిగే కొద్దీ ఆ కల్మషమే హరించుకుపోయి “పక్క వాడికంటే ముందు ఉండాలి” అన్న ఆలోచనతో మొదలయ్యి ఈర్ష్య ,ద్వేషం గా కొనసాగి “ఆఖరికి పక్కవాడిని ముంచే” స్థాయికి చేరుతుందేమో!!
Well said!
nice post 🙂
మీకు వినాయకచవితి శుభాకాంక్షలు
dont worry coming next “Seniors Sa.re.ga.ma.pa”. I think its already staretd.