చదివాక ఈ కిందదీ ఎంతో సముచితం అని భావించి టపా రాస్తున్నా
మా వీధి లో జరిగిన ఒక యధార్ధ సంఘటన మీ ముందు ఉంచుతున్నా
“మేము ఉంటున్నది రైల్వే కాలనీ.ఇళ్ళన్నీ పక్క పక్కనే.గోడలు ఇళ్ళకు మాత్రమే,మా మనసులకి కాదు.
రామారావు గారు,వారి భార్యకవిత ,3 పిల్లలు.కవిత గారిది చక్కటి రూపం.
వాళ్ళ ఎదురింటిలో వెంకటయ్య గారు.రిటైరు అయ్యారు.4 అబ్బాయిలు
రామా రావు గారు పొద్దున్నే ఉద్యోగానికి వెళ్ళడం తో,వెంకటయ్య గారింట్లోనే కవిత కు కాలక్షేపం
ఈ క్రమం లో వెంకటయ్య గారి ఆఖరి అబ్బాయి కళ్యాణ్ తో సీతకి స్నేహం ఏర్పడింది. కవిత పిల్లలు కళ్యాణ్ ని “మావయ్య” అని పిలిచే వారు.
రామారావు పని వత్తిడి వలన ఎక్కడికైనా తీసుకువెళ్ళక పోతే కళ్యాణ్ , కవిత ను తీసుకెళ్ళే వాడు
క్రమం గా వీళ్ళ స్నేహం పెరిగింది.అది ఎంత వరకు వచ్చింది అంటే,రామరావు,కవిత సంసార విషయాలను సైతం ఈ కళ్యాణ్ తో చర్చిండం వరకు.
ఈ స్నేహన్ని ఆ వీధిలో ఒక్కొక్కరూ ఒక్కో పేరుతో పిలిచే వారు.
లోకుల మాటలు ఎందుకు నిజం చెయ్యకూడదు అన్న ఆలొచన కవిత కు కలిగింది.అదే సమయం లో మా ఊరిలో చిరు ఉద్యోగం చేస్తున్నా కళ్యాణ్ కు తిరుపతి లో రావడం తో అక్కడికి కవిత , కళ్యాణ్ చేరుకున్నారు.”
రామారావు ఆ ఊళ్ళో ఉండలేక వేరే ఊరు బదిలీ అయ్యారు.ప్రస్తుతం కవిత 3 పిల్లలు కవిత తండ్రి దగ్గర
పెరుగుతున్నారు.
దిగజారుతున్న విలువలకు సజీవ దృశ్యం ఈ సంఘటన.
ఎవరి దారి వారు చూసుకున్నారు.మధ్యలో బలి అయ్యింది పసి పిల్లలు
పెళ్ళై,చక్కగా సంసారం,చక్కని పిల్లలూ ఉండి కూడా తాత్కాలిక ఆకర్షణను,కా(లో)కుల మాటలకు ఊతం ఇచ్చింది కవిత .
పెళ్ళి కాక ముందు ఏది చేసినా అది పూర్తిగా వ్యక్తిగతం.పెళ్ళయ్యాక చేస్తే అది ఆ ఇద్దరికీ సంబంధించినది.పిల్లలు కలిగాక చేస్తే అది ఒక సంపూర్ణ కుటుంబానికి చెందినది
కవిత దృష్యా తను చేసింది ఒప్పే కావచ్చు.
కానీ మధ్యలో తమ భవిష్యత్తును పణం గా పెట్టింది అభం శుభం తెలియని పిల్లలు
తమ మధ్య స్వచ్చమైన స్నేహాన్ని పది మందీ తప్పుగా అనుకొని ఉండచ్చు.అయినంత మాత్రాన అది నిజం ఎందుకు చెయ్యాకూడదు అనుకోవడం,అదే నిజం చేసి అందరి ఊహలను నిజం చెయ్యడం తప్పు
serious issues ni light teesko antu meeru cheppina saili bagundi. kavitha katha tappakunda anni items nenu chadivta!
ఆమె పొట్ట నింపడానికి వెళ్లవలసి వచ్చి తనను తిప్పలేక పోయిన భర్తకు అన్యాయం చేసినట్లే. ఇంకా ఇంకా బిజీ అవుతున్న ఉద్యోగాల తరుణంలో ఇలాంటి సంఘటనలు ఇంకా ఎక్కువే అవుతాయి…