ఆయన పేరే తెలుగు సాహిత్యం లో ఒక సంచలనం,ఒక వివాదం
ఆయన పుస్తకాలు చదవమని ఎన్ని చేతులు అందిచాయో,అన్నే చేతులు నన్ను అడ్డూ చెప్పాయి
ఆఖరికి “విషాదం” ఈ వారంతరం చదవగలిగాను
100పుటాల చిన్న పుస్తకం,అయినా ఆలోచింపచేసేది
ఈ పుస్తకం లో చలం విషయాలు స్పృశిస్తాడు.అవి:
పుణ్యం-పాపం,భయం,ద్వేషం-ఈర్ష్య,కామం,సెక్సు కంట్రోలు,హిందూ పతివ్రతలు,అన్యకాతలడ్డంబైన,ప్లేటోనిక్ లవ్,పత్రికలు చేసే అపచారం, కవిత్వం దేనికి,సినిమా జ్వరం,త్యాగం
ఒక్కో అంశం చదివాక నిజం గా రెండురకాల ఆలోచనలు కలుగుతాయి
చలం వాదన విన్నాక చాలా విషయాల్లో ఆయన ఆలోచనా విధానం నన్ను ఆశ్చర్య పరిచింది
నేలవిడిచి సాము వద్దని,వాస్తవాన్ని గ్రహించి మనిషి గా బ్రతకమని చెప్పినట్టే అనిపిస్తుంది
కానీ ఇంకాస్త లోతుగా ఆయన వాదనని చూస్తే,నిజమైన ఆనందాన్ని తెలుసుకోలేదేమో చలం అని అనిపిస్తుంది
(ఈ పుస్తకం రచించేనాటికి)
“అన్యకాంతలడ్డంబైన” ఈ అంశం మీద ఆయన సుధీర్గ వ్యాసం ఒకింత విసుగు తెప్పించినా,ఆయన ఆలోచన తీరు నన్ను ఆలోచింపచేసింది
పోతన భాగవతం లో ప్రహ్లాదుని గుణాలను చెప్తూ..”అన్యకాంతలడ్డంబైమ మాతృభావన చేయు ” అన్న పద్యం ఉంది
ప్రహ్లాదుని వయసు 3 నుంచీ 10 వరకు ఉండవచ్చు.ఆ వయసులో అన్యకాంతలు,బాతృభావన చెయ్యడం ఏంటి అంటూ చలం ప్రశ్నించాడు
దీనికి జవాబు:కవి-సామాజిక స్పృహ/భాధ్యత
ఈ విషాదం పుస్తకం మొత్తం చదివాక,చలం లో ఇదే లోపించిందేమో అని నాకు అనిపించింది
ఎవరూ చూడని స్వర్గం కోసం,ఎవరూ పొందని మోక్షం కోసం వెంపరలాడడం కంటే,మనిషిగా అన్ని సుఖాలను(శారీరిక సుఖం) పూర్తిగా అనుభవించమని,ఇంద్రియ నిగ్రహం అక్కర లేదనీ చలం చాలా స్పష్టం గా చెప్పుకొస్తాడు.
ఇలా చెయ్యకుండా మోక్షం ,స్తితప్రఙ్ఞత ని “హిపోక్రసి” అంటాడు.తమని తాము మోసం చేసుకోవద్దంటాడు.
పుస్తకం మూసేసే ముందు చిన్న సందేహం……ఇన్ని చెప్పి,మన పూర్వులు చెప్పినదంతా ఈ కాలానికి వర్తించదు అని గట్టిగా నమ్మి ఆఖరికి రమణ మహర్షి ని ఆశ్రయించడం ఏంటీ అని??
శివగోవింద గోవిందా,హరి గోవింద గోవిందా అని పాడుకోవడం నా వంతు ఆయింది
ఏమనాలో కూడా తెలియటం లేదు… చదివితేగానీ చెప్పలేను.
mee varaku mee visleshaNa bagundi!
చలం రచనలలో negetive అంశాలకంటే positive ఎక్కువ.చలం ‘స్త్త్రీ’,’బిడ్డల శిక్షణ’ చదివి ఒక అభిప్రాయానికి రండి.
After he started living with Ramana Maharshi..
He himself made a statement that all his earlier workings are CRAP and those needs to be destroyed
🙂
@ Srujana
కలంకలల ఫణి గారు అన్నట్టు రచయిత తన రచనని పబ్లిష్ చేసేసినతర్వాత అతనికి ఆ రచనమీద అధికారం పోతుంది. ఆ రచనకి అతనికతీతమయిన ఒక Identity ఏర్పడుతుంది.
శక్తి ఉన్నంతవరకూ సమాజాన్నెదిరించిన చలం వృధ్ధాప్యంలో తన అభిప్రాయాల్ని మార్చుకుని ఉండొచ్చు. కానీ అప్పటికే ఆయన్ను చదివినవారి అభిప్రాయాలు మార్చలేరు కదా.
నాకైతే ఆయన భావాల్లో చాలావరకు లాజిక్ కనిపిస్తుంది.