కొందరంటే తెలియని అభిమానం
వాళ్ళని ఎప్పుడూ కలిసి ఉండం
మాట్లాడి ఉండం
దగ్గరి నుంచీ చూసి కూడా ఉండం
కలుస్తాము అన్న ఆశా ఉండదు
కానీ ఎందుకో వాళ్ళంటే ఇష్టం
వాళ్ళు టీ వీ లో వస్తే చాలు,పరిగెత్తు కుంటూ వస్తాం
పేపర్ లో వాళ్ళ వేలు పడ్డా కత్తిరించుకోని,మన గోడలకు అతికించుకుంటాం
వాళ్ళ మాట చెవులు రిక్కించి మరీ వింటాం
మనిషంటే ఇలా ఉండాలి రా అంకుంటాం
అలా నేను అనుకోనే వారిలో మొదటి వ్యక్తి “అబ్దుల్ కలాం”
రాష్త్రపతి అంటే ఇలా అని ఎప్పుడో చిన్నప్పుడు సాంఘిక శాస్త్రం లో చెప్పారు:ఇన్ని ఏళ్ళ వయసు నిండాలి,భారత పౌరుడు అయ్యి ఉండాలి,ఎటువంటి నేరచరిత్ర ఉండకూడదు,ఎటువంటి పార్టీ కీ చెంది ఉండకూడదు వగైరా(క్షమించాలి..ఆఖరి రెండూ ఇప్పుడు తప్పనిసరి,రాజ్యాంగాన్ని త్వరలో సవరించాలి)
తన పదవీ కాలం లో రాష్ట్రపతి కి కొత్త నిర్వచనం చెప్పారు,”రబ్బర్ స్టాంపు”,పార్టీ అద్యక్షుడి చట్రం లాంటి పదాలను తిరగారిసింది బహుశా ఈయనేనేమో.
నిత్యం చిరునవ్వుతో భావి భారత పౌరులని ఉత్తేజితం చేస్తూ,శాస్త్ర విఙ్ఞానం పై నిరంతరం ఆశక్తి కలిగిస్తూనే ఉన్నారు.
అసలు రాష్ట్రపతి అంటే ఈయనేరా…అని ఎన్ని సార్లు అనుకున్నానో
తొలి మహిళా రాష్త్రపతి ఎన్నిక జరిగిన తీరు చూస్తే ఎందుకో మనసు కల్లుక్కు మంది
సామాన్య పౌరుడి గళానికి విలువలేని ఈ ఎన్నిక ఎంత వరకు సబబు??
నా ప్రాంతపు ఎం ఎల్ ఏ కనీసం వోటు వెయ్యలేదు!
ఇక నాలాంటి వారి అభిప్రాయం(కనీసం కాగితం మీదైనా) పరిగణలో తీసుకోలేదు
అసలు రాష్ట్రపతి అంటే కచ్చితం గా ఎదో ఒక రాజకీయ పార్టీ అండ ఉండాలా??
రాజ్యాంగ నిపుణులో,దేశన్ని నిజం గా ముందుకు నడిపించే వారో కాదా??అలాంటి వాది పేరు వినిపించినా ఎవరూ మదత్తు ఇవ్వరేమో!!
మహిళా సాధికారత,విలువల విజయం వంటి పదాల ముసుగులో,తన మీద ఉన్నా నేరాలను కనీసం ఖండిచలేని తొలి మహిళా రాష్ట్రపతీ……..నీకు నా ____( మా సోనియా గాంధీ,ఇటలీ నుంచీ ఇంగ్లీషుకు,ఇంగ్లీషు నుంచీ హిందీ కి,హిందీ నుంచి తెలుగులోకీ తర్జుమా చెయ్యించుకోని ఈ ఖాళీ ని పూరిస్తారు)
చాలా కరెక్ట్ గా చెప్పారు…లోపల లోపల ఉన్న నా ఫీలింగ్స్ ని మీరు మీ పదాలలో మీ బ్లాగులో పెట్టారు..(బహుసా ఇది మీది,నాదే కాదేమో…చాలా మంది “మన చేతులలో ఏముందిలే” అని బయటకి చెప్పని అభిప్రాయం)
They were showing this in BBC, saying that “this will bring new hope for all women in India & lot of things going to change for women” , not sure if they know what a president can do in India. Its pity..
బయటికి చెప్పినా, చెప్పకపొయినా, చాల మంది అభిప్రాయమిదే. ఈ “రాచకీయ” ఖేళిలో విజ్ఞతకు కాదు, విధేయతకే పెద్దపీట.
వల్లూరి
మీ తెలుగు బ్లాగు టపాలు చాలా బాగున్నై. ఎక్కడ దాక్కున్నారు ఇంత కాలం?
కథల కేటగిరీలో జెట్టరు పెన్ను కథ ఇంకేదో బ్లాగులో చదివిన గుర్తు.
ఫ్లికర్ లో పెట్టిన కొండచరియల బొమ్మలు రెండూ కూడా అద్భుతంగా ఉన్నై – ప్రదేశం ఎక్కడో చెబుతారా అభ్యంతరం లేకపోతే?
బాగా చెప్పారు.
కొత్త పాళీ గారు,నేను లలితా స్రవంతి ని.(మయూఖా)….
కొన్ని కారణల వల్ల ఆ బ్లాగు ను డిలీట్ చేసాను
అయినా ఇంత మందిని వదిలేసి ఎక్కడికి వెళతాను [:)]
ఓ మీరేనా. సంతోషం. మీ మయూఖని మొన్నెప్పుడో చూడబోతే కనబళ్ళేదంది మంత్రదర్పణం – అదన్న మాట కత. అవునూ, రాఘవ అనే అతను మొన్న “ముదితల్ నేర్వగరాని” పద్యం పోస్టు చేసి వాగ్దేవి లలితక్క కి థాంకులని రాశాడు – in fact అతను పెట్టిన లింకు నించే ఈ బ్లాగుకి వచ్చాననుకుంటా. మీ పాతబ్లాగులో కతల్చదివి మీరేదో చిన్నమ్మాయనుకున్నాను – అంచేత ఇతను “లలితక్క” అనేప్పటికి పోల్చుకోలేదు
అఫ్కోర్సు, అతను మిమ్మల్ని లలితక్క అన్నంత మాత్రాన మీరు చిన్నమ్మాయి కాకూడదనేం లేదు.
బాబోయి!!నేను చిన్న పిల్లనే అండీ..మా అమ్మా నీకేం తెలుసు ఇంకా చిన్న పిల్లవి,ఊరుకో అని రోజూ అంటుంది
రాఘవ అక్కయ్యా అని పిలుస్తాడండీ..ఏంటో నేను చిన్న పిల్లననీ(నా వయసు సినిమా వాళ్ళకు మల్లే constant అని ఎలా చెప్పేది రా దేవుడా
నేనేదో “చక్కగా చెప్పావక్కయ్యోయ్” అం…దామనుకుని, వ్యాఖ్య వ్రాద్దామని వస్తే యిక్కడ యీ అక్కీయమేమిటో, చిన్నాపెద్దల విషయాలేమిటో… అంతా ‘విష్ణుమాయ’!