అనుకోకుండా ఒక మితృడి ద్వారా సాలూరి రాజేశ్వర రావు గారు స్వయం గా పాడిన పాటల గొళ్ళెం దొరికింది
http://www.tlca.com/adults/saluri.html
“పాడమని నన్నడగతగునా….” అంటూ దాసరథి గీతాం ఎందుకో తెగ నచ్చేసింది.
“పొదలమాటున పొంచి పొంచి ఎదను దోచిన వేణు గానము,ఒలక బోసిన రాగసుధ కు,మొలకలెత్తిన మథుర గీతి….”
” ఎవరూ లేని,యమునా తటినీ,ఎక్కడో ఏకాంత మందున…..మథుర గీతి……”
నిజమే ఇంతకన్నా మథుర గీతి ఎక్కడైనా ఉందా???
రజేశ్వర రావు గారి స్వరం ఘంటసాల అంత మాథుర్యం గా లేకున్నా….కానీ ఏదో ఉంది.
పీలగా గా సాగే ఆలాపన పక్కనే సన్నగా హార్మోనియం,దానికి తాళం వేస్తూ తబలా..అంతే…ఇంకేం పెద్ద వాయిద్యాలు లేవు….అయినా రెండు రోజులు మా ఇంట్లో ఏకధాటిగా ఈ పాట అలా ఆడుతూనే ఉంది.