తప్పెవరిది…తప్పెవరిది ???

It takes a second to have a crush on someone,
an hour to like someone,
a day to love someone,
but a life time to forget someone”

తప్పెవరిది…తప్పెవరిది
దెనికి చలించనని మురిసి పొయె గత కలపు నాదా??తొలి చూపులొనె నీకు వశమైన నీ చూపులదా??
తప్పెవరిది??
ఫ్రతి నవ్వులొ నిన్ను చూసుకున్న నా పెదవులదా?నీ రెప్పపాటు చూపుకే కందిపొయినా నా చెక్కిళ్ళదా?నీతొ రహస్యం అడుగులు వెసినా నా అడుగులదా?
తప్పెవరిది?
నీ తలపులతొ జూగిన నా రాత్రులదా?నా కలలొ నిన్ను చూపించిన నా కను పాపలదా?నీకై నే రాసుకున్న నా మనొలేఖలదా?ఫ్రతి రాగం లో మనల్ని చూపించినా ఆ యుగళగీతాలదా?వాటి భావాలదా?మన ఊసులన్ని పలికించిన ఆ గువ్వల జంటదా?
తప్పెవరిది??
మరొకరి సొంతం అని తెలిసినా ఆశీర్వదించని నా సంస్కారానిదా?నాకే సొంతం అన్న భరొసాతొ ఉన్న నా నిన్నదా??నీకు ఎమీ చెప్పలేని నాదా??
తప్పెవరిది??ఎడతెరపిలెని నా కన్నీళ్ళదా?గుణపాఠాల ఘ్నాపకం గా దాచుకొలేని నా బుగ్గలదా?డస్సిపోక అడ్డుచెప్పలేని నా చెతులదా?
ఇంత జరిగినా ఇంకా నిన్నే కొరుకునే నా పిచ్చి మనసుదా??
తప్పెవరిది ..తప్పెవది???

“Love starts with a smile,continues with a kiss and ends with a tear drop

ప్రచురితం: on జూన్ 14, 2007 at 5:57 పూర్వాహ్నం అభిప్రాయములు (1 )

ఈ టపాని ట్రాకుబ్యాకు చెయ్యడానికి URI: http://vaagdevi.wordpress.com/2007/06/14/%e0%b0%a4%e0%b0%aa%e0%b1%8d%e0%b0%aa%e0%b1%86%e0%b0%b5%e0%b0%b0%e0%b0%bf%e0%b0%a6%e0%b0%bf%e0%b0%a4%e0%b0%aa%e0%b1%8d%e0%b0%aa%e0%b1%86%e0%b0%b5%e0%b0%b0%e0%b0%bf%e0%b0%a6%e0%b0%bf/trackback/

ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్

ఒక కామెంటు Leave a comment.

  1. ఏం రాసిండ్రు మేడం.. నిజంగ జెప్తున్న… మస్తున్నది… ఇది భావ కవిత్వమన్నట్టా..?


Leave a Comment